కోబలి

pawan-kalyan-trivikram-movie

చిరంజీవి స్టామినా బాగా తెలిసిన డైరక్టర్ కోదండ రామిరెడ్డి. ఆ కాంబినేషన్ ఎవరూ టచ్ చేయలేరు. కారణం ఈ రోజుల్లో అన్ని సినిమాలు చెయ్యడం కష్టం.

పవన్‌కల్యాణ్ స్టామినాతో పాటు పవన్‌కల్యాణ్ ఇష్టాలు బాగా తెలిసిన దర్శకుడు త్రివిక్రమ్. ఈ కాంబినేషన్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా బోర్ కొట్టదు.

అత్తారింటికి దారేది సినిమా షూటింగ్‌లో వున్నప్పుడే వారి కాంబినేషన్‌లో తర్వాత సినిమా ‘కోబలి’ అనే వార్తలు వచ్చాయి కాని, అప్పుడు ఎవరూ కన్‌ఫార్మ్ చెయ్యలేదు. ఇప్పుడు త్రివిక్రమ్ కన్‌ఫార్మ్ చేసాడు.

త్రివిక్రమ్ అంటే కచ్చితంగా మంచి సినిమానే.

Screen Shot 2013-10-26 at 11.31.04 AM

– మీరు, పవన్ కలిసి చిన్న సినిమాలు నిర్మిస్తారనుకుంటే.. ‘కోబలి’ తీస్తామంటున్నారేంటి?
కోబలి రెగ్యులర్ ప్యాటర్న్ సినిమా కాదు. నాకూ, పవన్‌గారికి అంతంత రెమ్యూనరేషన్స్ ఇచ్చేవారు ఇలాంటి వాటిని ఇష్టపడతారో? లేదో? అందుకే మేమే ఈ సినిమా చేస్తున్నాం. భవిష్యత్తులోనూ చాలా సినిమాలు చేస్తాం. కొన్ని కథలను నేను ఎంత చేసినా ఇది త్రివిక్రమ్ సినిమాలాగా లేదు అంటారు. త్రివిక్రమ్ సినిమాలాగా ఉండటమంటే ఏంటో నాక్కూడా తెలియదు. కానీ ఆడియన్స్ అలా ఫిక్సయిపోతారు. అలా నా దృష్టిలోకొచ్చిన, పవన్‌గారి దృష్టిలోకొచ్చిన మంచి కథలతో ఈ సంస్థలో సినిమాలు చేస్తాం.

– కోబలి బడ్జెట్ ఎంతవుతుంది?
ఆ కథ ఇంకా ప్రిలిమినరీ స్టేజస్‌లోనే ఉంది. శాతవాహనుల తర్వాత కాలం నాటి లాంగ్వేజ్‌ను, కప్పట్రాల ఆ ప్రాంతాల్లో వాడిన అచ్చమైన తెలుగును వాడుతున్నాం. ఇప్పటికీ ఆ ఏరియాలో అందమైన తెలుగు వినిపిస్తుంది. మెహబూబ్‌నగర్‌లోని పలు గ్రామాల్లో కూడా తెలుగు భాష సౌందర్యం వినిపిస్తూనే ఉంటుంది. లాంగ్వేజ్‌పై రీసెర్చ్ జరుగుతోంది. కోబలి స్క్రిప్ట్‌కే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే సినిమా ఎప్పుడు ప్రారంభిస్తామో చెప్పలేం.