క్లాస్‌కు నచ్చితే 100 కోట్ల సరైనోడు

AA

హిట్ సినిమాలు నాలుగు రకాలుగా విభజించవచ్చు

  1. క్లాస్ సినిమా
  2. మాస్‌కు నచ్చే క్లాస్ సినిమా
  3. మాస్ సినిమా
  4. క్లాస్‌కు నచ్చే మాస్  సినిమా

చిరంజీవి మాక్స్జిమమ్ సినిమాలన్నీ 4 రకం అంటే క్లాస్ మెచ్చిన మాస్ సినిమాలే. మెగాస్టార్ స్టేటస్ తెచ్చిపెట్టాయి.

క్లాస్ సినిమాలు మంచి తేరు తెచ్చిపెడతాయి గాని డబ్బులు తేవు. మాస్‌కు నచ్చే క్లాస్ సినిమాలు తీయడం చాలా కష్టం. చాలా చాలా అరుదుగా వస్తూ వుంటాయి. రీసెంట్‌గా అంటే ఊపిరి సినిమా మాస్‌కు నచ్చే క్లాస్ సినిమా అనుకోవచ్చెమో. పేరుతో పాటు ఖర్చు డబ్బులు కూడా వెనక్కి వస్తాయి.

మాస్ సినిమా అంటే ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి. like రచ్చ, నాయక్ & ఎవడు.

క్లాస్‌కు నచ్చే మాస్  సినిమా అయితే తిరుగుండదు.

మంచి క్లాస్ సినిమాకు మాస్ ఎలిమెంట్స్ కలపడంలో విఫలం చెంది, ఫెయిల్ అయిన సినిమాలెన్నో వున్నాయి. క్లాస్ మాస్ లెక్కలు అంత ఈజీగా సినిమాలకు కుదరవు.

క్లాస్ దూరంగా వుంటారని తెలిసినా, ఇప్పటివరకు సరైనోడు సినిమాను మాస్ సినిమా కాకుండా, కొత్త కేటగిరి క్రియేట్ చేసి వూర మాస్ క్రింద ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. కారణాలు ఏమిటి? ఒక వ్యూహం ప్రకారం చేస్తున్నారా అనేది సినిమా వచ్చేదాకా చెప్పలేము.

మేకర్స్ చెపుతున్న ప్రకారం ఈ ఊర సినిమా క్లాస్‌కు కూడా నచ్చేతే, అల్లు అర్జున్ ఇప్పుడున్న ఫార్మ్‌కు తెలుగులో 100 కోట్లు షేర్ ఖాయం అంటున్నారు మెగా ట్రేడ్ పండితులు.

Filed Under: సరైనోడు

commentscomments

  1. anonymous says:

    100 cores ???????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *