క్షమించి వదిలేస్తాడనిపిస్తుంది

Screen Shot 2013-09-25 at 8.38.32 PM

అత్తారింటికి దారేది అరవై నిమషాలు విడియో రిలీజ్‌కు కారకులైన ఆ అమాయకులను చూస్తుంటే చాలా జాలీ వేస్తుంది. పాపం. అభిమానులో, దురాభిమానులో .. వాళ్ళను చూస్తుంటే తెలియనితనంతో చేసిన తప్పులా అనిపిస్తుంది తప్ప, ఈ సినిమా లీక్ చెయ్యడం ద్వారా ఏదో సంపాదించేసుకొని బాగుపడి పొదాం అని లీక్ చేసిన వాళ్ళలా లేరు.

రాజ్యాధికారాన్ని అడ్డు పెట్టుకొని కోట్లకు కోట్లు దోచేసుకుంటున్న రాజకీయ నాయకులెందరో దర్జాగా బ్రతికేస్తున్నారు. టివి లెక్కి నోటికొచ్చినట్లు అడ్డగోలుగా తాము దేశాన్ని ఉద్దరించే కబుర్లు చెపుతున్నారు. అత్తారింటికి దారేది అరవై నిమషాలు విడియో లీకేజ్ వలన నిర్మాతకు/డిస్ట్రిబ్యూటర్స్ లు ఎంత నష్టం జరిగిందో తెలియదు కాని, ఎప్పుడు రిలిజ్ అవుద్దో అని అందోళనతో వున్న అభిమానులకు సినిమా చూసే భాగ్యం కలుగుతుంది.

సినిమాపై పెట్టుబడి పెట్టిన వాళ్ళ దృష్టిలొ వారు చేసింది క్షమించరాని నేరం అయినా, మనసున్న పవన్ కల్యాన్ ఆ భారాన్ని తనపై వేసుకొని, వారిని క్షమించి వదిలేస్తాడనిపిస్తుంది.

Filed Under: Pawan KalyanFeatured