ఖలేజా – మై టాక్

mahesh-trivikram

సినిమా ఎలా వుంది ?
ఒక కొత్త మహేష్ బాబును చూడవచ్చు. UNEXPECTED. ఇరగదీసేసాడు.

కొత్త మహేష్ బాబు అంటే ?
యువరాజు సినిమాలో పవన్ కళ్యాన్ తమ్ముడు సినిమాలో చేసినట్టు ఒక చోట చెయ్యాలని ప్రయత్నం చేసాడు. చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. ‘ఒక్కడు’, ‘అతడు’, ‘పోకిరి’ అండర్ ప్లేనే. మహేష్ బాబును చాలా కంట్రోల్డ్ గా చూపించి, ఇమేజ్ మరియు అండర్ ప్లే తోనే ఆ సినిమాలను నడిపించారు. ఖలేజా ఆ సినిమాలకు పూర్తి వ్యతిరేకం. పవన్ కళ్యాన్ ఎలా ఓవర్ యాక్షన్ చేస్తాడో అలా మహేష్ బాబు చేసాడు. ఎక్కడా కూడా ఎబ్బెట్టుగా లేదు. మొదట్లో ఇలా చేస్తున్నాడు ఏమిటి అనిపించినా, చిన్నగా పిచ్చ పిచ్చగా నచ్చేసింది నాకు.

త్రివిక్రమ్ గొప్పతనం ఏమిటి ?
మెగా అభిమానులు చరణ్-త్రివిక్రమ్ కాంబీనేషన్ కోసం వెయ్యి కళ్ళతో కాదు, వెయ్యి కోట్ల కళ్ళతో ఎదురు చూడవచ్చు.

స్టొరీ ఏమిటి ?
స్టొరీ ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘మహేష్ బాబు దేవుడు’. ఈ కథను ఇంత ఎఫక్టివ్ గా త్రివిక్రమ్ తప్ప ఎవరూ చెప్పలేరేమో !

సినిమా అంత అద్భుతంగా వుందా ?
కమర్షియల్ గా మగధీర సినిమాను కొట్టే సినిమా కాకపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ గిజిబిజిగా సాగినా, సెకండ్ ఆఫ్ టూ మచ్ వుంది. ఇదేమిటిరా ఇలా వుంది అనిపించే లోపల మన మనుసులోని మాటను మహేష్ బాబు చేతే చెప్పించి అదే ఫ్లోలో సినిమాను చివరి దాకా నడిపించిన విధానం అద్భుతం.

తప్పక చూడవలసిన సినిమానా ?
మహేష్ బాబు ఫాలోయర్స్, త్రివిక్రమ్ ఫాలోయర్స్ తప్పక చూడవలసిన సినిమా. మహేష్ బాబు చేత ఓవర్ యాక్షన్ చేయించి మెప్పించిన దర్శకుడిగా త్రివిక్రమ్ అనితర సాధ్యుడు అనిపించింది. ఒక సీరియస్ సీన్ మనస్పూర్తిగా నవ్విస్తూ ఎలా చెప్పవచ్చో త్రివిక్రమ్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు.

సినిమా గురుంచి ఫైనల్ గా చెప్పదల్చుకుంది ఏమిటి ?
రెండే మాటలు. మహేష్ బాబు & త్రివిక్రం. పాటలు నార్మల్. ఫస్ట్ ఆఫ్ గజిబిజి. BUT ఫస్ట్ ఆఫ్ వలన సెకండాఫ్ అద్భుతంగా పండింది. ఏ సినిమాతో compare చేయకపోతే, ఈ సినిమా సూపర్. BEST performance from MAHESH BABU.

Filed Under: Extended FamilyHari Reviews