గబ్బర్‌సింగ్ టెంపర్

temper

శివబాబు బండ్ల సమర్పిస్తున్న సినిమా ‘టెంపర్‌’. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేశ్‌ నిర్మాత.

పవన్‌కల్యాణ్‌కు పూర్వ వైభవాన్ని తెచ్చిన సినిమా గబ్బర్‌సింగ్. బండ్ల గణేశ్‌ నిర్మాత. దర్శకుడు హరీష్‌శంకర్. మిరపకాయ్ సినిమా చూసిన వాళ్ళు ఎదో తీస్తాడులే అనుకున్నారు. ట్వీటర్లో బాగా హైప్ చెయ్యడానికి ప్రయత్నం చేసేవాడు కాని, ఎవరూ నమ్మలేదు. టీజర్ వదిలాడు. అంతే హరీష్ మీద కొద్దిగా నమ్మకం వచ్చింది. పాటలు వచ్చాక బాగానే తీసుంటాడని నమ్మకం వచ్చింది, కానీ ఎదో అనుమానం మాత్రం అలా వెంటాడుతూనే వుంది.

ఇప్పుడు టెంపర్ పరిస్థితి కూడా అలానే వుంది. పూరి జగన్నాధ్ అంటే “బాబోయ్” అనే పరిస్థితి వుంది. కాకపొతే ఇలా డౌన్లో వున్నప్పుడే “పొకిరి” ఇచ్చాడు. మూవీ స్టిల్స్ అంచనాలు పెంచుతున్నాయి. ట్రైలర్స్ కచ్చితంగా బాగా కట్ చేస్తాడు. కానీ ఎదో అనుమానం మాత్రం అలా వెంటాడుతూనే వుంది. పూర్వ వైభవాన్ని తెచ్చి పెడుతుందా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Filed Under: Extended FamilyFeatured