గోపిచంద్ vs సాయి ధరమ్ తేజ్

Screen Shot 2015-03-08 at 12.46.10 PM

‘బాహుబలి’ మే 15 అని ఎనౌన్స్ చేసారు. ‘S/O సత్యమూర్తి’ ఏప్రిల్ 2 కు సిద్దం అవుతుంది. ఈ డేట్స్ బట్టి మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ ఎడ్జస్ట్ చేసుకొవాలి.

‘రేయ్’ స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మార్చి 27th అని ఎనౌన్స్ చేసారు. దోచేయే ఏప్రిల్ 17 రిజర్వ్ చేసుకున్నారు.

గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘జిల్’. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ లాంటి సినిమాల తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ – వంశీలు మరోసారి కొత్త డైరెక్టర్ రాధాకృష్ణని పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘జిల్’. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆడియో మార్చి 12న రిలీజ్ కానుంది.

మూవీని మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

దీని ప్రకారం గోపీచంద్ – సాయి ధరమ్ తేజ్ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతున్నట్టు.సాయి ధర్మ్ తేజ్ “పిల్లా .. నువ్వు లేని జీవితం” సినిమాతో మెగా అభిమానులతో పాటు క్లాస్-మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటే, గోపిచంద్ “లౌక్యం” సినిమాతో కామెడీ జోనర్లో కూడా మంచి పట్టు సాధించాడు.

Filed Under: Extended FamilyFeaturedTeluguరేయ్