గోవిందుడు అందరివాడేలే హిట్టా ఫట్టా

ramcharan

“గోవిందుడు అందరివాడేలే” మొదలైనప్పుడు అటు ప్రేక్షకుల్లోనూ ఇటు అభిమానుల్లోనూ ఎటువంటి అంచనాలు లేవు. టీజర్ రిలీజ్‌తో ఒక మంచి తెలుగుసినిమా చూస్తామనే భావన మొదలైంది. ఆడియో ఇనిస్టెంట్ హిట్ కాకపొయినా, వినగా వినగా పాటలు బాగున్నాయనే టాక్‌ను సొంతం చేసుకున్నాయి.

సినిమా వచ్చి ఐదు రోజులయ్యింది. సినిమా హిట్టా ఫట్టా అని చర్చించుకుంటున్నారు.

ప్రేక్షకులు సినిమా బాగుందా లేదా అనే చూస్తారు. సినిమాలో కొత్తదనం ఏమీ లేదని ఫీల్ అవుతున్నారు.

అభిమానులు మాత్రం హిరో బాగా చేసాడా లేదా? సినిమాలో డామినేట్ చేసాడా లేదా? సినిమా అంతా తనయై నడిపించాడా లేదా? అనేది చూస్తారు. అభిమానులు రామ్‌చరణ్ అహో ఓహో అని చెప్పుకునే రీతిలో ఏ ప్రత్యేకతా చూపించలేదు.

ఫట్ అయితే మాత్రం కాదని చెప్పవచ్చు. ఎందుకంటే కలక్షన్స్ బాగున్నాయి. పండగ సీజన్ ప్లస్ అయ్యింది. అలా అని పండగ అయినంత మాత్రానా సినిమా ఘోరంగా వుంటే కలక్షన్స్ రావు. సినిమా చూసిన వాళ్ళు కొత్తగా ఎమీలేదని అంటున్నారు తప్ప బాగోలేదని అని మాత్రం అనటం లేదు.

రామ్‌చరణ్ పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ & మరో సాంగ్ కలపడం ద్వారా పాటలు స్లోగా హిట్ అయినట్టు సినిమా కూడా హిట్ రేంజ్‌కు వెళ్ళడానికి ఛాన్స్ వుంది.

Filed Under: Mega FamilyFeatured