చిరంజీవి పిరికొడా?

Is-Dasari-jealous-of-Chiru

హిరో స్టామినా
నిర్మాత సత్తా & రిస్క్
సినిమా మీద వున్న హైప్

మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని సినిమాను ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తూ వుంటారు. సినిమా అటూ ఇటూ అయితే సినిమా షేర్ నెగిటివ్‌లోకి వెళ్ళిపోతుంది. చాలా చాలా రిస్క్ కూడా.

అది తప్పు, దాని వలన చిన్న సినిమాకు అన్యాయం జరుగుతుందంటే .. చిన్న నిర్మాతలందరూ ఒక్కటై పొరాటం చెయ్యాలి. అంత కేర్ చేసే వాడైతే వాళ్ళకు నాయకత్వం వహించి పొరాడాలి .. అంతే కాని,

అందరూ చేస్తున్నప్పుడు ఒకడిని వెలెత్తి చూపించడం దారుణం.

నాకు వాడంటే పడదు కాబట్టి, నేను వాడిని ఎల్లప్పుడూ టార్గెట్ చేస్తూనే వుంటా. అన్న రీతిలో దాసరి చిరంజీవిని సమయం సందర్భం లేకుండా విమర్శలతో టార్గెట్ చేస్తున్నాడు.

చిరంజీవి వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ వుండదు సరికదా, దాసరినే వాళ్ళ సినిమాలకు క్లాప్ కొట్టడానికి రెడ్ కార్పెట్‌తో ఆహ్వానం పలుకుతాడు. చిరంజీవి పిరికొడా? అని మెగా అభిమానులు ఫీల్ అవుతున్నారు.

చిరంజీవిని సరే ..

దాసరి మరింత దిగజారి పిల్లోడు అని చూడకుండా రామ్‌చరణ్ మొహన్ని చెక్కించుకుంటున్నాడు .. జనాలపై రుద్దుతున్నారని అనవసరమైన కామెంట్స్ చెయ్యడం దాసరి స్థాయికి తగదని సినీ మేదావులంటుంటే, మెగా అభిమానులు మాత్రం పచ్చి బూతులు తిడుతున్నారు. (దాసరికి మైకు దొరికితే తెలిసెందే కాబట్టి, ఎవరూ అంత సిరియస్‌గా తీసుకొవడం లేదనుకోండి)

తనని అంటే ఏమి అనని చిరంజీవి, రామ్‌చరణ్‌పై దాసరి చేసిన కామెంట్స్‌కు స్పందిస్తాడని ఆశీద్దాం. దాసరి అనవసరంగా నోరు జారాడు కాబట్టి, చిరంజీవి గట్టిగా సమాధానం చెప్పడానికి ఇది మంచి అవకాశం.

మీడియా అటెన్షన్ కోసం దాసరి ఇండైరక్ట్‌గా చిరంజీవిని టార్గెట్ చెయ్యడం వరకు ఓకే, ఒకడిని పొగడటానికి ఇంకొకరిని అవహేళన చేసి మాట్లాడటం తప్పు.

Filed Under: Mega Family