చిరంజీవి లాస్ట్ టాలీవుడ్ నెం 1

chiru-no-1

చిరంజీవి లాస్ట్ టాలీవుడ్ నెం 1. –మహేష్‌బాబు

ఎవరి స్టామినా వాళ్ళది. ఏ హిరో తక్కువ కాదు.

రామయ్యా వస్తావయ్యా సినిమాలో హరీష్‌శంకర్ చెప్పినట్లు యంగ్ ఎన్.టి.ఆర్ నిక్కర్లు వేసుకునే టైంలోనే రికార్డ్స్ కొట్టాడు.

ఖుషీ సినిమా అప్పుడు పవన్‌కల్యాణ్ వున్న క్రేజ్ , ఇప్పుడు వున్న క్రేజ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.

ఒక్కడు పోకిరి దూకుడు .. మహేష్‌బాబు క్రేజ్ వీళ్ళద్దిరి కంటే ఏమీ తక్కువ కాదు.

మగధీర .. మగధీర తర్వాత రచ్చ & నాయక్ కమర్షియల్ హిట్స్‌తో రామ్‌చరణ్ చిరంజీవి అభిమానులను అలరిస్తున్నాడు. అతి తక్కువ టైంలో స్టార్డం సాధించాడు.

చిరంజీవి టైమ్‌లో చిరంజీవి డామినేషన్ వున్నంతగా ఏ ఒక్క హిరోకు ఇప్పుడు లేదనేది వాస్తవం.

SO, మహేష్‌బాబు చెప్పినట్టు చిరంజీవి లాస్ట్ టాలీవుడ్ నెం 1. ప్రేక్షలందరూ ఏక గ్రీవంగా ఈ హిరో నెం 1 అనే పరిస్థితి ఇప్పుడు లేదు. ఏ హిరో సినిమా హిట్ అయితే, ఆ హిరో నెం 1 అనిపిస్తూ వుంటుందంతే.

అన్నిటికంటే ముఖ్యం, పవన్‌కల్యాణ్‌కు తన పని తను చేసుకుంటూ సినిమా మీద సినిమా చేయడం తప్ప, ఈ నెంబర్ గేమ్స్ అసలు పట్టించుకోడు.

పవన్‌కల్యాణ్ ఇంటరెస్ట్‌తో సినిమాలు చేస్తున్నాడు. అది చాలు పవన్‌ఫ్యాన్స్‌కు. చాలా బరువైన నెం 1 పొజిషన్ పవన్‌కల్యాణ్‌కు వద్దు.

Filed Under: Mega FamilyFeatured