చిరుత vs ముకుంద

new generation mega brothers

రామ్‌చరణ్ మొదటిసినిమాకు చిరంజీవి తనయుడిగా రామ్‌చరణ్‌పై చాలా ఒత్తిడి వుంది. రామ్‌చరణ్ ఎలా పెరఫార్మ్ చేస్తాడు & స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా వుంటుందనే భయం చిరంజీవిలో చాలా వుండేది. రామ్‌చరణ్‌ను తెలుగుప్రేక్షకులకు పరిచయం చేయవలసిన బాద్యతను పూర్తిగా అశ్వనీదత్ & పూరి జగన్నాధ్ పై పెట్టేసాడు మెగాస్టార్ చిరంజీవి.

చిరంజీవి ఫ్యామిలి ఎటువంటి సినిమా కోరుకుందే అటువంటి సినిమాను తీయడంలో పూరి జగన్నాధ్ 100% సఫలం అయ్యాడు. 1) మాస్ ప్రేక్షకులను అలరిస్తూ 2) చిరంజీవి అభిమానులను సాటిఫై చేస్తూ 3) చరణ్ ఏమి చేయగలడో ఎలా చేయగలడో .. ఇలా అన్నీ కలిపి అద్భుతంగా తీసాడు పూరి జగన్నాధ్. చిరుత అనే టైటిల్ ఆలోచనకు పూరి జగన్నాధ్ పొగడటానికి ఈ పేజి సరిపోదు. మగధీర సినిమాకు ఒక స్ట్రాంగ్ పునాదిగా చిరుత నిలిచింది.

అందగాడు పొడుగైన వాడు వరుణ్ తేజ్‌పై రామ్‌చరణ్ అంత ఒత్తిడి లేదు కాని, భారీ అంచనాలు వున్నాయి. శ్రీకాంత్ అడ్డాల గొప్ప వ్యక్తిత్వం కలిగిన గొప్ప డైరక్టర్ అనటంలో సందేహం లేదు, కాని వరుణ్ తేజ్ తన మొదటిసినిమాకు అతనిని ఎంచుకోవడం కచ్చితంగా సాహసమే. కారణం 1) మాస్ డైరక్టర్ కాదు 2) కమర్షియల్ రేంజ్ లేదు.

ప్రస్తుతం ట్రెండ్, స్టిల్స్, ట్రైలర్స్ & పాటలు .. చూస్తుంటే వరుణ్ తేజ్ నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది.

మెగా అభిమానుల ఆశల మేరకు, అన్నీ కలిసొచ్చి వరుణ్ తేజ్ తన మొదటిసినిమాతోనే 50 కోట్లు షేర్ సాధిస్తాడా లేదా అనేది త్వరలో తెలుస్తుంది.

మెగా అభిమానుల ఆశలు పక్కన పెడితే 1) ఒక క్లాస్ సినిమా గ్యారంటీ 2) యూత్‌కు ఒక మంచి సినిమా డబుల్ గ్యారంటీ.

Filed Under: Mega FamilyFeatured