“జిల్” సూపర్ డూపర్ హిట్

jil

లౌక్యం సూపర్ డూపర్ హిట్ తర్వాత గోపిచంద్ హీరోగా వస్తున్న చిత్రం “జిల్”. మిర్చి వంటి బ్లాక్ బస్టర్ తో తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అందుకున్న నిర్మాతలు వంశీ, ప్రమోద్ సంయుక్తంగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రభాస్ ముఖ్య అతిధిగా హాజరై విడుదల చేసిన ఆడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్ రాశిఖన్నా అందచందాలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని ట్రైలర్స్ చెపుతున్నాయి

‘జిల్’ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లలో చాలా మంది ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాన్ని కూడా కొనుగోలు చేసారట. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం వారం వాయిదా పడటానికి “రేయ్” సినిమాతో పాటు ఇది కూడా కారణం అంటున్నారు. “జిల్” సూపర్ డూపర్ హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Filed Under: Extended FamilyFeaturedTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *