జూలై 15న “అ .. ఆ”

aaaudio

మహేష్‌బాబును అతడు సినిమాతో సరికొత్త కోణంలో అవిష్కరించిన త్రివిక్రమ్, జులాయి సినిమాతో అల్లు అర్జున్‌ను పెద్ద హిరోల పక్కన నిలబెట్టాడు. ఇప్పుడు నితిన్ రేంజ్ పెంచడానికి చేస్తున్న “అ.. ఆ” సినిమా అంతా రెడీ అయిపొయి, మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తుంది. మే 13 లేదా మే 20న రిలీజ్ అవ్వాలి కాని, మహేష్‌బాబు “బ్రహ్మోత్సవం” సినిమా మే 20న రిలీజ్ కానున్న సందర్భంగా, ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఎనౌన్స్ చెయ్యలేదు.

అమెరికాలో లాంగ్ వీకెండ్ కవర్ అయ్యేలా, “అ .. ఆ” మే 27న రిలీజ్ చేస్తే బాగుంటుంది కాని, బ్రహ్మోత్సవం కూడా క్లాస్ సినిమానే కావడంతో ఒక వారం గ్యాప్ సరిపోదని అంటున్నారు. జూన్ నెల స్కూళ్ల హాడావుడి, జూలై 1 న రజనీకాంత్ “కబాలి” రిలీజ్ వుండటంతో, ఆ సినిమాకు కూడా రెండు వారాలు గ్యాప్ ఇస్తూ, జూలై 15న రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

పోటి వుండాలి. ఆ సినిమా కంటే మా సినిమా బాగా తీయ్యాలి అనే పొటీ వుండాలి. మా సినిమాలో అన్నీ వున్నాయి. కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే అహంకారం వుండకూడదు. ఎవరొచ్చినా ఆగే ప్రసక్తి లేదనుకొవడం ఒక విధంగా, ఇప్పుడున్నా పరిస్థితుల్లో మూర్ఖత్వం అనుకోవచ్చు. మన తెలుగు ఇండస్ట్రీ హిరోల డామినేషన్ ఇండస్ట్రీ. మన నిర్మాతలు కూడా హిరోకు వున్నటువంటి మార్కెట్ చూసే ఖర్చు పెడతారు తప్ప, సినిమా మీద కాదు. హిరోల డామినేషన్ బ్రేక్ చేస్తూ కొందరు దర్శకులు సినిమాలు చేయగల్గుతున్నారు. త్రివిక్రమ్ సినిమా పెద్ద హిరోల సినిమాలను తట్టుకొని నిలబడగల్గినా, మహేష్‌బాబు ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చుద్ది.

“అ .. ఆ” ఒక మంచి సినిమా. నిదానంగా జూలై 15న రిలీజ్ చేసి, ఎవరికీ విరోధం కాకుండా, అందరి మన్ననలతో పెద్ద విజయం సాధించే అవకాశం వుంది. మంచి పేరుతో పాటు, మంచి డబ్బులు కూడా వస్తే, తర్వాత సినిమాను మరింత రిచ్‌గ తీసే అవకాశాలు వుంటాయి.

Filed Under: అ ఆ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *