జ్యోతిలక్ష్మి

Jyothilakshi

ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ”జ్యోతిలక్ష్మి ” రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి ప్రారంభం అవుతోంది. దానితో పాటు జ్యోతిలక్ష్మి మోషన్ పోస్టర్ ,ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ చిత్రాన్ని సి. కళ్యాణ్ నిర్మిస్తుండగా పూరి జగన్నాద్ దర్శకత్వం వహిస్తున్నారు.

“టెంపర్” సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్న పూరి జగన్నాధ్ ఈ సినిమా ఎలా తీర్చిదిద్దుతాడోనని అందరూ ఎదురుచూస్తున్నారు. టెంపర్ అంటే వక్కంతం వంశీ అందించిన కథ, ఈ సినిమా మాత్రం తన మార్కు మరో పైత్యం సినిమా తీసినా ఆశ్చర్య పొవక్కర్లేదని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మల్లాది వెంకటకృష్ణమూర్తి రచించిన ఓ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.

Filed Under: Extended FamilyTelugu