టాలీవుడ్ నెం 1 హిరో రామ్ చరణ్

no_1_ramcharan

పలానా హిరో నెం 1 హిరో అని ఎవరో ఒకరు లేదా ఎదో ఒక వర్గానికి చెందిన మీడియా డిక్లేర్ చేస్తే ఆ హిరో నెం 1 హిరో అయిపోడు. అలానే నెం 1 క్వాలిఫికేషన్స్ కలిగిన హిరోను ఎవరూ సప్రెస్ చెయ్యలేరు అని చిరంజీవి నిరూపించాడు.

“ఇప్పుడు రామ్ చరణ్ కు టాలీవుడ్ నెం 1 హిరో క్వాలిఫికేషన్స్ వున్నాయా?” అంటే నెం 1 క్వాలిఫికేషన్స్ ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది.

1) బిగ్గెస్ట్ టాలీవుడ్ హిట్ ‘మగధీర’
2) తాను చేసిన నాలుగు సినిమాలలో ‘ఆరెంజ్’ ఒకటే కమర్షియల్ ఫ్లాప్.
3) మంచి పేరున్న దర్శకులతో మాత్రమే కాదు, కొత్త దర్శకులతో కూడా మంచి కలక్షన్స్ సాధించగలను అని, నిన్న ‘రచ్చ’తో నిరూపించాడు.
4) వినాయక్ లాంటి మాస్ దర్శకుడు తోడైతే తన బిజినెస్ స్టామినా ఏమిటో, నేడు ‘నాయక్’ తో నిరూపిస్తున్నాడు.
5) అన్నిటి కంటే ముఖ్యమైనది: తాను చేసే సినిమాపై రామ్ చరణ్ చూపించే శ్రద్ధ మరియు ప్రేక్షకులకు ఎదో ఇవ్వాలని ఆత్రం.
6) S/O చిరంజీవి అవ్వడం ఒక బరువైన బాద్యత అని చిన్న వయసులోనే తెలుసుకోవడం మరియు రెస్ట్ లేకుండా సినిమా కోసమే రేయింబవళ్ళు కష్టపడటం..

Filed Under: Mega FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *