డాన్సర్‌గా సాయి ధరమ్ తేజ్

REY

చిరంజీవి మేనల్లుడైన సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘రేయ్’ కి సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసారు. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తూ, పవన్‌కల్యాణ్ బ్యాకప్‌తో నిర్మిస్తున్న చిత్రం ఈ రేయ్. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రం ఫిబ్రవరి నెల్లో రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు. సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలనుకున్నారు కాని, రామ్‌చరణ్ ఎవడు సౌకార్యార్దం ఈ సినిమాను ఫిబ్రవరిలోకి మూవ్ చేసారు. అల్లు అర్జున్ రేసుగుర్రం రిలీజ్‌ను బట్టి ఈ సినిమా రిలీజ్ వుండవచ్చు.

కరేబియన్ ఐ ల్యాండ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే మ్యూజికల్ లవ్ స్టొరీ ‘రేయ్’. ఈ మూవీలో ప్రొఫెషనల్ డాన్సర్ అయిన సాయి ధరమ్ తేజ్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాంపిటీషన్ కి వెళ్ళే కుర్రాడి పాత్రలో కనిపిస్తాడు.

వైవిఎస్ చౌదరి ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ లోని డాన్స్, యాక్టింగ్ స్కిల్స్ ని పూర్తిగా ఆవిష్కరించనున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సయామీ ఖేర్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో శ్రద్ధ దాస్ సెకండ్ హీరోయిన్ మరియు మెక్సికన్ పాప్ సింగర్ గా కనిపించనుంది.

Filed Under: Mega FamilyFeatured