రోడ్డు మీద తిరుగుతూ, డ్రామాలు చెయ్యాలి

pawan kalyan

జనసేన స్థాపించి ఒక సంవత్సరం అయ్యింది. ఏమి సాధించాడు అంటే, అనుభవమున్న నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చాడు. చంద్రబాబు కోరిక మేరకు జగన్‌పై ప్రత్యక్ష విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసాడు & జగన్ అభిమానులకు విలన్ అయ్యాడు.

పవన్‌కల్యాణ్ చాలా స్పష్టంగా వున్నాడు.

  1. చంద్రబాబుపై నమ్మకం వుంది.
  2. భూమిని కొల్పోతున్న రైతుల ఆవేదన కూడా తెలుసుకున్నాడు.
  3. అభివృద్ది కావాలి, కాని రైతులను కన్విన్స్ చేసి చెయ్యండి. వాళ్ళ కన్నీరుతో కాదు, అని ప్రభుత్వానికి సూచించాడు.
  4. ప్రభుత్వంపై ఒత్తిడి తేగల్గాడు. చంద్రబాబు స్పందించాడు.

పవన్‌కల్యాణ్‌కు సినిమాలే జీవనాధారం కావడంతో పాటు అభిమానులు కూడా సినిమాలు ఆశీస్తుండటంతో పవన్‌కల్యాణ్ తన సమయాన్ని సినిమాల కోసం కూడా వెచ్చించవలసి వస్తుంది.

గత ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడంతో, పవన్‌కల్యాణ్ పార్ట్ టైం పొరాటాలతో జగన్ అభిమానులు & జగన్ మీడియా సంతృప్తి చెందడం లేదు. పవన్‌కల్యాణ్ కూడా రోడ్డు మీద తిరుగుతూ, డ్రామాలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

మెగా అభిమానులు మాత్రం పవన్‌కల్యాణ్ సినిమాలకే పరిమితం కావాలని కోరుకుంటున్నారు.

Filed Under: Pawan KalyanFeaturedTelugu