తండ్రి బాటలో తనయుడు

ram-charan-upasana

చిరంజీవి అభిమాని ఎవరైనా నేను చిరంజీవి అభిమాని అని గర్వంగా చెప్పుకుంటారు. చిరంజీవి రాజకీయ వైఫల్యంతో చిరంజీవి మీద చిరంజీవి అభిమానులకు అభిమానం తగ్గిందనుకొవడం పొరబాటు. సమయం మనది కాదు, అని సమయం కోసం వెయిట్ చేస్తున్నారంతే. కచ్చితంగా వస్తుంది. చిరంజీవికి పూర్వ వైభవం రావాలని అభిమానులు ఎంత కోరుకుంటున్నారో, పవన్‌కల్యాణ్ & రామ్‌చరణ్ లు అంతకన్నా ఎక్కువ కోరుకుంటున్నారు. అందుకు వారు ఏమి చెయ్యగలరో అది చేస్తున్నారు. నిజం వూరు దాటే లోపల అబద్దం ప్రపంచం అంతా చుట్టివస్తుందన్నట్టు, రాజకీయం వైఫల్యం ద్వారా పొగొట్టుకున్న ఇమేజ్ సంపాదించుకొవడానికి టైం పడుతుంది. ఓపికతో వేచి వుండాలాంతే.

బ్లడ్‌ బ్యాంక్, నేత్రదానం కార్యక్రమాలతో తండ్రి ఏవిధంగా సమాజసేవ చేస్తున్నాడో అలాగే కొడుకు రామ్‌ చరణ్‌ కూడా ఆ బాటలోనే వెళ్తున్నాడు. ఈ మధ్యనే హుధూద్‌ తుఫానుకు విరాళం ఇవ్వడమే కాకుండా అపోలో హాస్పిటల్స్‌ తరపున వైద్య సేవాకార్యక్రమాలు కూడా అందించాడు. ఇక ఇప్పుడు పిల్లల కోసం హెల్త్ క్యాంపులు నిర్వహించాలని రామ్ చరణ్ నిశ్చయించు కున్నాడు. తన తండ్రి చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ కార్య క్రమాలతో పాటు ఈ చిన్న పిల్లల సేవా కార్యక్రమాలు కూడా కొనసాగుతాయని అభిమానులకు చరణ్ సోషల్‌ సైట్‌ ద్వారా తెలిపాడు. ఈ కార్యక్రమాలలో తన భార్య ఉపాసన కూడ సహకరిస్తుందని వెల్లడించాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 12 ఎంపిక చేసుకున్న ఏరియాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తాడట రామ్ చరణ్.

అంతేకాదు ఏ చిన్నారికి ఆరోగ్య సమస్య ఉన్నా వెంటనే అక్కడ అంటెండ్ అయి ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపెడతామని రామ్ చరణ్ చెపుతున్నాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా 2.65 లక్షల బ్లడ్ శాంపిల్స్ సేకరించాం అని చెపుతూ దాదాపు 8 లక్షల మందిని ఇప్పటి వరకు కాపాడగలిగామని ఆనందం వ్యక్తం చేశాడు.

Filed Under: Mega FamilyFeaturedTelugu