తడబడితే స్పష్టత లేనట్టు కాదు

pawan

పవన్‌కల్యాణ్ అన్ని అంశాలపై స్పందించాడు. తడబడితే స్పష్టత లేనట్టు కాదు.

రేవంత్‌రెడ్డి:
తప్పు చెయ్యలేదు. పార్టీ ఆదేశాల మేరకు ఓటు కోసం డబ్బులు అందజేసాడు. శిక్ష పడితే పార్టీకి పడాలి. మన న్యాయ వ్యవస్థకు అని అధికారాలు లేవు. అది జరిగితే ఏ ఒక్క రాజకీయ పార్టీ మిగలదు.

సెక్షన్ 8:
హైదరాబాద్ తెలంగాణకు ఇచ్చేసారు. మళ్ళీ దానిని తీసుకొని వెళ్ళి కేంద్రం చేతిలో పెట్టాలనుకొవడం అవివేకం. సీమాంధ్రకు అన్యాయం జరిగింది. న్యాయం కోసం పొరాడాలి. సీమాంధ్ర నాయకులు సీమాంధ్ర అభివృద్దిపై దృష్టి పెట్టండి. హైదరాబాద్‌పై సీమాంధ్ర నాయకులు హక్కుల కోసం పొరాడవద్దు. ప్రజల మధ్య మరింత చిచ్చు పెట్టవద్దు.

బాద్యత కలిగిన తెలంగాణ నాయకులు, ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు అని అనొద్దు. ఇక్కడ వున్న వాళ్ళంతా తెలంగాన వాళ్ళే. వాళ్ళను అలానే ట్రీట్ చెయ్యండి. రాష్ట్రాలు రెండు అయిన, తెలుగు జాతి ఒక్కటే. తెలంగాన ప్రత్యేక రాష్ట్రం మాత్రమే. ప్రత్యేక దేశం కాదు.

మిడియా:
వార్తలు కూడా వెటకారంగా చెపితే కాని, జనాలకు చేరటం లేదు. అలా అని, శ్రుతి మించకూడదు. ప్రభుత్వాలు మిడియాపై ఆంక్షలు విధించకూడదు.

బి.జె.పి:
బి.జె.పి కూడా కాంగ్రెస్ మాదిరే వ్యవహరిస్తుంది. ప్రజా ప్రతినిధులు గట్టిగా మాట్లాడాలి.

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *