తెలుగువాళ్ళకు గుర్తింపు ‘బాహుబలి’

bahubali

మన దేశంలో రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్ళినప్పుడు మీరు ఎవరు అంటే తెలుగు అని చెపుతాం. ఓ మెగాస్టార్ చిరంజీవి లాంగ్వేజా అనేవారు. దేశం కాని దేశంలో అయితే సౌత్ ఇండియా అనే కాని, మన తెలుగుకు పెద్ద గుర్తింపు లేదు. హైదరబాద్ అని కొంతవరకు చెప్పుకోవచ్చు (లేటేస్ట్‌గా హూదాద్ తుఫాన్ వచ్చిన ప్రాంతం అని చెప్పుకోవచ్చు.).

అద్భుతాలు అనుకోకుండా జరగాలే తప్ప సృష్టించలేము అని అంటూ వుంటారు. అలా అనుకోకుండా జరిగిందే మగధీర. కాని ఆ సినిమా మన తెలుగువాళ్ళకే పరిమితం అయింది. కాకపొతే వేరే లాంగ్వేజ్ మేధావులలో మాత్రం రాజమౌళి దగ్గర చాలా విషయం వుందని తెలియజేసింది.

మగధీర సినిమా మాదిరి అనుకోకుండా అద్భుతాలు జరగడం కాకుండా, ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో అద్భుతాలు సృష్టించడానికే పనిచేస్తున్న సినిమా బాహుబలి. ‘బాహుబలి’ అంటే తెలుగు అన్న రీతిలో తెలుగువాళ్ళకు గుర్తింపు తెస్తుందెమో చూడాలి.

మాస్ ప్రేక్షకులకే పరిమితం అయిన రాజమౌళి మగధీర సినిమాతో తెలుగులో అన్ని వర్గాల పేక్షకులకు దగ్గరయ్యాడు.బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయితో పేరు సంపాదించుకుంటాడో లేదా దేశ స్థాయిలో పేరు సంపాదించుకుంటాడో చూడాలి.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలు కనీసం రెండు మూడు సంవత్సరాలు ఆపేసి, స్లోగా బాగా అలోచింది కొత్త జోనర్లో మళ్ళీ ఇంకో ఇన్నింగ్స్ మొదలుపెట్టడం బెటర్.

రచ్చ, నాయక్, ఎవడు లాంటి కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడని ఎన్నో విమర్శలు ఎదుర్కోకుంటున్న రామ్‌చరణ్ ఈ విషయంలో అభినందనీయుడు. గోవిందుడు అందరివాడేలే సినిమా చెయ్యడం ద్వారా ఆ విమర్శలు ఇంకా ఎవరూ ఇప్పుడు చెయ్యకపోవచ్చు. మగధీర తర్వాత కేవలం ఆరెంజ్ అనే ఒక్క ఫ్లాప్‌తో సరిపెట్టుకొని బ్యాక్ టు ఫార్మ్ లోకి వచ్చాడు. బ్యాక్ టు తెలుగు సినిమా రెగ్యులర్ కమర్షియల్ ట్రాక్‌లోకి రావడం రామ్‌చరణ్ అంతా ఈజీ కాదు ప్రభాస్‌కు.

Filed Under: Extended Familyబాహుబలి