దాసరి ఎర్రబస్‌ను బ్యాన్ చెయ్యాలనుకుంటున్న మెగాఫ్యాన్స్

Errabus-Movie-Stills-12

చిరంజీవిని అభిమానించే వాళ్ళ కంటే చిరంజీవి సక్సస్‌ను చూసి కుళ్ళుకునే వాళ్ళు అంత కన్నా ఎక్కువ మంది వుంటారెమో. అందులో దాసరి ప్రధముడని ఆయన యాక్షన్స్‌ను బట్టి అర్దం అవుతుందంటున్నారు మెగాఫ్యాన్స్. చిరంజీవిని ఇండైరక్ట్‌గా ఎన్ని మాటలు అన్నా, చిరంజీవి స్పందించడు. కారణం స్పందించవలసిన అవసరం లేదు. చిరంజీవికి కష్టపడటమే తెలుసు. వాళ్ళను ఇగ్నోర్ చెయ్యడమే చిరంజీవి ఆయుధం. చిరంజీవి పిరికితనం అని అనుకునే మెగాఫ్యాన్స్ కూడా వున్నారు.

చిరంజీవిని సరే .. రాజకీయాల్లో ప్రతి అడ్డమైన వాడు చేసిన విమర్శలకు మెగా అభిమానులు అలవాటు పడిపొయారు.

మిడియా అటెన్షన్ కోసం, దాసరి దిగజారి పిల్లోడని కనికరం లేకుండా రామ్‌చరణ్‌ను రామ్‌చరణ్ సినిమాను విమర్శించడం మెగాఅభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. దాసరి ఎర్రబస్‌ను సెల్ఫ్ బ్యాన్ చెయ్యాలనుకుంటున్నారు

దాసరి చేసిన తప్పు ఏమిటి?
మిడియా అటెన్షన్ కోసం ఎవరి మీదో ఇండైరెక్ట్ కామెంట్స్ చెయ్యడం, అవి చిరంజీవిని ఉద్దేశించినవే అని మీడియా ప్రచారం చెయ్యడం మొన్నటి దాకా జరిగింది. ఈసారి మాత్రం పొరబాటున లౌక్యం సినిమా రిఫర్ చెయ్యడం ద్వారా దాసరి రంగు బయటపడింది. మరో ప్రెస్ మీట్‌లో రివర్స్ గేర్‌లో మిడియాను తప్పు పడుతున్నాడు.

సినిమాను చేస్తే చేసాడు సరే.. అది వ్యాపారం. అనుకోవచ్చు.

ఆయన స్థాయి కి ఆయన వయసుకు ఆయన అనుభవానికి “మొఖాలు చెక్కించుకుంటున్నారు. జనాలపై రుద్దుతున్నారు.” అని పర్సనల్ కామెంట్స్ చెయ్యడం క్షమించరాని నేరం.

1) సినిమా అనేది మాయా ప్రపంచం. అందంగా కనపడటం అనేది అందులో పెద్ద భాగం. దానికి కావల్సిన జాగర్తలు తీసుకోవాల్సిన బాద్యత ప్రతి నటుడిపై వుంది. హిరోలపై మరింత ఎక్కువ వుంది. మొఖాలను చెక్కించుకొవడం అనేది అసలు తప్పే కాదు.

2) చూసే ప్రేక్షకులు లేక తీసే నిర్మాతలు లేక .. సొంత డబ్బులతో సినిమాలు మీద సినిమాలు తీసి జనాలను టార్చర్ చేసే సినిమాలు చేసే వాళ్ళను రుద్దుతున్నారు అంటే ఒక అర్దం వుంది. నిజం చెప్పాలంటే వాళ్ళను అనటం కూడా తప్పే. ఎందుకంటే ఎంతోమందికి జవనోపాధి కల్పిస్తున్నారు.

నాగ శౌర్యను పొగడటానికి, వారసులను విమర్శించడమే అని అనుకొని చేసిన పర్సనల్ కామెంట్స్ కూడా రామ్‌చరణ్‌ను ఉద్దేశించే అన్నాడని అనుకొవడానికి కారణం లౌక్యం సినిమాను డైరక్ట్‌గా రిఫర్ చెయ్యడమే.

దాసరి చేసింది మూమ్మాటికి తప్పు. మెగా అభిమానులు బ్యాన్ చేసినంత మాత్రానా సినిమాకు వూడేదెమీ లేకపొవచ్చు. దాసరి నిజ స్వరూపం బయటపడింది. మెగా అభిమానుల ఇగో చల్లారాలంటే చిరంజీవి గట్టిగా సమాధానం చెప్పాలి లేదా దాసరి బహిరంగ క్షమాపణలు చెప్పాలి.

Filed Under: Extended Family