‘దిల్’ రాజు పరిస్థితే ఇలా వుంటే ..

dil raju

సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యకముందే, సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని చేసిన సినిమా బ్రూస్‌లీ. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చి రిలీజ్ అయిన సినిమా రుద్రమదేవి. రెండు వారాలు గ్యాప్ కూడా వుంది. అయినా కాని, దర్శక రత్న దాసరి పెద్ద సినిమాలకు పండగలు అవసరం లేదని, తనదైన స్టైల్లో స్టేట్‌మెంట్ ఇచ్చేసాడు. మీడియా పట్టించుకోలేదనుకొండి.

తెలుసుకొవాల్సిందేమిటంటే, సెప్టెంబర్, అక్టొబర్ నెలల్లో ఐదు వారాల గ్యాప్‌లో నాలుగు మెగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అసలు ప్లానింగ్ లేదని మెగాఅభిమానులు విమర్శలు కూడా చేసారు. అంతే కాదు, నిన్న సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో రెండు నందమూరి వారి సినిమాలు వున్నాయి.

సమ్మర్లో రిలీజ్ అవ్వడానికి నాలుగు మెగాసినిమాలు రెడీగా వున్నాయి. ఒకటి/రెండు వారాల మించి గ్యాప్ వుండకపోవచ్చు.

దిల్ రాజు పరిస్థితి ఇంకా దారుణంగా వుంది. 6 నెలలు వడ్డీ బొక్క.

‘కృష్ణాష్టమి’ సినిమా షూటింగ్ ఆగస్టులోనే పూర్తయింది. సెప్టెంబరులో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ రిలీజ్ ఉండటంతో అక్టోబరులో రిలీజ్ చేద్దామనుకున్నా. కానీ, ‘రుద్రమదేవి, అఖిల్, బ్రూస్‌లీ’ లాంటి పెద్ద సినిమాల రిలీజ్‌లను ప్రకటించడంతో డిసెంబరులోనో, సంక్రాంతి టైమ్‌లోనో రిలీజ్ ప్లాన్ చేశాం. అప్పుడు కూడా చాలా సినిమాలు ఉండటంతో అనువైన తేదీ కోసం చూశాను. ఫిబ్రవరి 19 సరైన డేట్ అనిపించింది..

‘దిల్’ రాజు

bottomline:
తెలుగు సినిమాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.

Filed Under: Extended FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *