దీపావళి బహుమతిగా

Pawan Kalyan

అత్తారింటికి దారేది సినిమా చూడని తెలుగువాళ్ళు ఇంకా మిగిలి వుంటారంటే డౌటే. రిపీట్ ఆడియన్స్ బాగా వుండే సినిమా కావడం వలన చూసినే వాళ్లే మళ్ళీ చూస్తున్నారు. మరోసారి చూసే వారి కోసం లేదా ఇంకా చూడకుండా మిగిలిన వున్న వాళ్ళ కోసం, ఈ సినిమా మేకర్స్ మంచి ప్లాన్‌తో వస్తున్నారు.

పవన్ కళ్యాణ్ లేటేస్ట్ ఇండస్ట్రీ హిట్ అత్తారింటికి దారేది సినిమా 75 కోట్ల రూపాయల షేర్ దాటి 80 కోట్లు వైపు పరుగులు పెడుతుంది. ఏమైన 100 కోట్లు దాటించాలని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఆలోచిస్తున్నట్టు వున్నాడు. దీపావళి బహుమతిగా మరికొన్ని సన్నివేశాలను అత్తారింటికి దారేది చిత్రానికి కలుపనున్నట్టు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. ఆరు నిమిషాల నిడివి ఉండే సన్నివేశాలను కలుపనున్నామని ఆయన తెలిపారు.

బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సాధిస్తున్న విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. దీపావళి సందర్భంగా అభిమానులను సంతోష పరుచడానికి మరి కొన్ని సన్నివేశాలను చిత్రానికి కలుపుతున్నాం. పండగ సెలవుల్లో అభిమానులు ఈ చిత్రాన్ని వీక్షించే విధంగా అక్టోబర్ 31 నుంచి ఏర్పాటు చేస్తున్నాం అని ప్రసాద్ తెలిపారు. పవన్ కళ్యాణ్ అభిమానులను ఈ సన్నివేశాలు అకట్టుకునే విధంగా ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అత్తారింటికి దారేది చిత్రం సెప్టెంబర్ 27 తేదిన విడుదలైంది. ఈ చిత్రంలో సమంత, ప్రణీత, బోమన్ ఇరానీ, నదియాలు నటించారు.

Filed Under: Pawan KalyanFeatured