దుమ్మురేపుతున్న డైలాగ్స్

hrudaya-kaleyam

సంపూర్ణేష్ బాబు…….మ‌నిషి ఆర‌డుగులు వుంటాడు. గెలికితే అర‌గంట‌లో వుంటాడు. డ‌బ్బుతో కొన‌డానికి అత‌డు షాంపూ కాదు. సంపూ.

ప్రేమ‌తో పిలువు…క‌రుణిస్తాడు
అర్ధించు…… ఆలోచిస్తాడు.
బ్ర‌తిమాలాడు…….ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు.
4
రేయ్….నేను క‌త్తి ప‌ట్టి న‌ర‌కం మొద‌లెడితే….ముక్క‌లు ఏరుకోవ‌డానికి ప్రొక్లెన్స్ రావాలి. ర‌క్తం పార‌డానికి డ్రైనేజీలు త‌వ్వాలి. నా పేరు త‌లుచుకుంటే ఉచ్చ పోయాలి. ఈ చేతుల‌తో పోయిస్తా.

రేయ్…దైర్యం ఎలా వుంటుందో తెలుస‌రా….ఆ దైర్యానికి భ‌య‌మేస్తే త‌ల‌దిండు కింద నా ఫోటో పెట్టుకుని ప‌డుకుంటుంది.

ప్రజెంట్ నెట్ లో దుమ్మురేపుతున్న ఈ డైలాగ్స్ చెప్పింది ఎవ‌రో తెలుసా..? సంపూర్ణేష్ బాబు.

జస్ట్ ట్రైల‌ర్ తోనే స్టార్ హీరోగా మారిపోయిన సంపూర్ణేష్ బాబు హృద‌య కాలేయంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను ‘ఈరోజుల్లో’ ‘రోమాన్స్’ ‘విల్లా’ వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించిన గుడ్ సినిమా గ్రూప్ టేకొవర్ చెయ్యడంతో ఇంకా మం చిక్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రాన్ని స్టీవెన్ శంకర్ దర్శకుడు. నీలం సాయి రాజేష్ నిర్మాత.

Filed Under: Extended FamilyFeatured