దేశద్రోహి అనటం దారుణం

18aamir-khan

తప్పు చెయ్యకుండా మనం భయ పడ్డామంటే అది భయపెట్టే వారి సమర్ధత కాదు మన అసమర్ధత! ఎవరికీ భయపడవద్దు! సత్యం న్యాయం ధర్మానికి తప్ప!

పరుచూరి గోపాలకృష్ణ

తనకు తన భార్యకు జరిగిన సంభాషణను అమీర్‌ఖాన్ చెప్పాడు. ఏ సందర్భంలో జరిగిందనేది చెప్పలేదు.దాని సారంశం “ఇండియా వదిలి వెళ్ళిపొదామని”. రాంగ్ టైంలో(పారిస్ లో సామాన్యులపై ఉగ్రవాదులు దాడుల వలన ముస్లింలు అంటే టెర్రరిస్టు అనే భయం కలుగుతున్న సమయం) చెప్పడం వలన అతని మాటలు చాలా పెద్ద తప్పుగా వినిపించాయి. దేశద్రొహిగా చిత్రీకరిస్తూ, అతని సినిమాలు చూడొద్దు అన్న రీతిలో ప్రచారం జరిగింది. దేశద్రోహి అనటం దారుణం.

ఒక సెలబ్రెటీ ఇలా సగం సగం మాట్లాడితే ఇలానే అపార్దం చేసుకుంటారు. ఒక పక్క దేవుడి పేరు చెపుతూ, అమాయక ప్రజలను క్రూరంగా చంపేస్తున్న సమయంలో ఇటువంటి స్టేట్‌మెంట్స్ కచ్చితంగా అపార్దానికి దారితీస్తాయి.

“నన్ను దేశద్రోహిగా మాట్లాడుతున్న వాళ్ళకు నా దేశభక్తిని చాటుకోవాల్సిన అవసరం లేదం”టున్న అమీర్‌ఖాన్ మాటలు తను నిజంగా ఫీల్ అయ్యే చెప్పినవే అని చెప్పడం బాగున్నా, దేశద్రోహి అనే విమర్శ అవేశంలో చేసిందిగా భావించి, దేశం విడిచి వెళ్ళిపొవాలన్న ఆలోచన వెనుక వున్న అసలు కథ అమీర్‌ఖాన్ బయటకు చెపితే బాగుంటుంది.

Filed Under: Extended FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *