దొరికితేనే దొంగ???

r-nthand

దోపిడికి రాజ మార్గం రాజకీయాలు. ప్రజా ఆమోదం కూడా వుంది. ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా వాళ్ళ ఓట్లను నోట్లతో కొనేసుకుంటున్నారు మన రాజకీయ నాయకులు. గెలుపు కోసం రాజకీయాల్లో ఏమి చేసినా తప్పు కాదు అని సెట్ చేసేసారు మన రాజకీయ నాయకులు.

రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే ఎంతో కఠినంగా వుండాలి, మొండిగా వుండాలి, కర్కటంగా వుండాలి, చావడానికైనా సిద్దంగా వుండాలి, పది మందిని చంపడానికైనా వుండాలి. తల వంచడానికి సిగ్గు పడ కూడదు. తలలు లేపడానికి అసలు వెనకాడ కూడదు. ఇంతకు మించి ప్రజలను మాయ మాటలతో మోసం చేయగల్గాలి. మాయ మాటలను ప్రజలకు నిజాలుగా చేరవేయడానికి సొంత మీడియా వుండాలి.

ఇవన్నీ చెయ్యాలంటే డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లాలి. అధికారంతో కుమ్ముకొవాలి. ఎవడికి ఎక్కువ దమ్ము & ధైర్యం వుంటే వాడే హిరో ఇక్కడ. వై.యస్ జగన్ కు దమ్ము & దైర్యం ఎక్కువ. తండ్రి అధికారాన్ని పెట్టుకొని విచ్చలవిడిగా సంపాదించుకున్నాడు. జగన్ ఒక్కడే కాదు, వై.యస్.ఆర్ ను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ, కొంత వాట జగన్‌కు ఇచ్చి తమకు అందిన కాడకు దోచుకున్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమైనా తక్కువ అనుకుంటే అంతకు మించిన ఆత్మ వంచన ఇంకోటి వుండదు. రాజకీయల్లో ఎవడైనా, ఎవడి శక్తి కొలది వాడు దోచుకుంటాడనేది జగమెరిగిన సత్యం.

5% నిజాయితీ పరులు వుంటారెమో. వీళ్ళు రాజకీయల్లో ఎందుకుంటున్నారో వీళ్ళకే తెలియాలి.

రేవంత్ రెడ్డి దొరికాడు అంతే. అందరూ దొంగలే అన్నది సత్యం.

నిజానికి రేవంత్ రెడ్డి చేసిన నేరం కాదు. తెలుగుదేశం పార్టీ చేసిన నేరం అది. రేవంత్ రెడ్డి కేవలం పాత్రధారి. తెలుగుదేశం పార్టీని రాజకీయాల నుంచి బహిష్కరించాలి. పార్టీ వ్యవస్థాపకుడు అన్నగారినే పార్టీ నుంచి గెట్టివేసి, ప్రజల ఆదరణతో ఎటువంటి సిగ్గు లేకుండా ముందుకు సాగుతున్న పార్టీకి ఇది పెద్ద విషయం కాకపొవచ్చు.

నిజమైన రాజకీయం అంటే అన్నీ వదిలేసుకొని “ప్రజా సేవ చెయ్యడం” “మన భావి తరాలకు మెరుగైన జీవితం అందించడం” అని అనుకుంటే, చంద్రబాబు చేసేది కరెక్టే. దిక్కు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు చంద్రబాబు ఎదో చేస్తాడనే ఆశ ఇంకా మిగిలే వుంది. జగన్ అధికారంలోకి వస్తే రౌడియిజం పెరిగిపోతుందనే భయం కూడా ప్రజల్లో వుంది.

bottomline:
ఓట్లకు డబ్బులు పంచడం లీగల్ చెయ్యాలి.

Filed Under: Featured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *