నవంబర్ 11న అఖిల్

Share the joy
  •  
  •  
  •  
  •  

Akhil

వీవీ వినాయక్ దర్శకత్వంలో అఖిల్ మొదటి సినిమా రూపొందిన విషయం అందరికీ తెలిసిందే. వేరే సినిమాల కోసం దసరా పండగ సీజన్‌ను త్యాగం చేసి, దీపావళి కానుకగా నవంబర్ 11న అఖిల్ సినిమా విడుదల చేస్తున్నారు.

అఖిల్ ట్రైలర్ చూసాక, సినిమాపై అనుమానాలు మొదలయ్యాయి. సినిమా మాస్ లుక్ వుండటంతో పాటు, క్లిష్టమైన కథగా కనిపించడంతో క్లాస్ ప్రేక్షకులు దూరంగా వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాక్ బాగుంటే క్లాస్ ప్రేక్షకుల ఆదరణ ఎలాను వుంటుంది కాబట్టి, అంత వర్రీ కానవసరం లేదు. మాస్ ప్రేక్షకులు ఎగబడే విధంగా ఫైట్స్, పాటలు బాగా వున్నాయి. ఈ సినిమా ద్వారా భారీ ఓపినింగ్స్‌తో పాటు, మాస్ ప్రేక్షకుల్లో మంచి బేస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్టోరి కిడ్స్‌కు బాగా నచ్చితే అఖిల్‌కు తిరుగుండదు.

Filed Under: Featuredఅఖిల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *