నాగేంద్రబాబుకు ఎందుకొచ్చిన దురద?

Naga-Babu

తప్పులు చేస్తూ, తప్పులు చేసే వాడు మన సామాజిక వర్గం అయితే తప్పు కాదని వాదించే స్థాయికి ప్రజలను నాయకులు దిగజార్చేసిన సమయంలో, “సామాజిక న్యాయం” అంటే అసలైన అర్దం ఏమిటో వివరించలేక ఘోరంగా ఫెయిల్ అయ్యాడు చిరంజీవి.

1) ప్రజల కోసం అన్నీ వదులుకొని నిజంగా టైం స్పెండ్ చెయ్యి, లేదంటే 2) తన రాజకీయ వైఫాల్యాన్ని హుందాగా ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణలు చెప్పి రాజకీయల నుంచి చిరంజీవి తప్పుకుంటే బెటర్ అని అభిమానులు ఆశీస్తుంటే ..

తన స్థాయిని తనే తగ్గించుకుంటున్న చిరంజీవిని చూసి చిరంజీవిని ఏమీ అనలేక అల్లు అరవింద్‌ను విమర్శిస్తూ కాలం గడిపేస్తున్నారు మెగా అభిమానులు.

ప్రతి అడ్డమైన వాడు మెగాస్టార్‌ను కించపరిచే విధంగా మాట్లడటం విని విని ఖండించలేని పరిస్థితి మెగా అభిమానులది.

ఇటువంటి సమయంలో నాగేంద్రబాబుకు ఎందుకొచ్చిన దురద?

  1. నేను సపోర్ట్ చేసినవాడు కచ్చితంగా గెలవాలి అన్న తపన లేదు ..(గెలుపు ఓటములను సమానంగా తీసుకొవాలి కాని, గెలుపు కోసం చూపించవలసిన పొరాటం తపన లేకపొతే ఎలా?)
  2. భయపెట్టి .. బ్రతిమలాడి .. లొంగదీసుకొవాలన్న ఆలోచన వున్నా, ఆచరణలో వీక్.
  • నేను ఎందుకు వీడిని బ్రతిమలాడాలన్న ఇగో.
  • నేను భయపెడితే నాకు చెడ్డపేరు వస్తుందెమోనని భయం.

తెరవెనుక సినిమా వాళ్ళ కుళ్ళు కుతంత్రాలు తెలియదు కాని,

నాగేంద్రబాబు సపోర్ట్ చేసినోడు ఓడిపొతే మన పరువు ఎక్కడ పోతుందోనని ఒక పక్క మెగా అభిమానులు భయపడుతున్నా, మాట ఇచ్చిన రాజేంద్రప్రసాద్ వైపే చివరిదాకా నిలబడిన నాగేంద్రబాబుపై మెగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

“జయసుధ” అయినా “రాజేంద్రప్రసాద్” అయినా నాగేంద్రబాబు హ్యాపీనే. ఎందుకంటే ఇద్దరూ సినియర్ ఆర్టిస్టులే. మొన్న టి.వి9లో క్లియర్‌గా చెప్పాడు.

Filed Under: Mega FamilyTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *