“నాన్నకు ప్రేమతో” టీజర్

ntr

పక్కా మాస్ హిరో నుంచి, బృందావనం, ఊసరవెల్లి, టెంపర్ .. ఇలా వైరటీ గెటప్స్‌తో, వైరటీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ ఎన్.టి.ఆర్ మారిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. మరో వైరటీ సినిమా గెటప్ చూస్తేనే తెలిసిపోతుంది. సుకుమార్‌ దర్శకుడు. ఈ రోజున ( అక్టోబర్ 21) టీజర్‌ని సాయంత్రం 6 గంటలకు విడుదల చేసారు.

‘ఐ వాంట్ టు ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు’ అనే పాటతో కూడిన ఈ టీజర్‌ విమర్శకులని ఆకట్టుకునే విధంగా వుంది. నార్మల్ మాస్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

టెంపర్ సక్సెస్తో మంచి ఫాంలో ఉన్న యంగ్ ఎన్.టి.ఆర్ ఈ సినిమా కోసం పూర్తి డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు. ‘వన్’ ఫెయిల్యూర్ తరువాత డైరెక్టర్ సుకుమార్ చేస్తున్న సినిమా కావటం కూడా మూవీపై అంచనాలు పెంచేసింది. హీరోల లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే సుకుమార్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఎన్టీఆర్ను సరికొత్తగా చూపిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, యంగ్ ఎన్.టి.ఆర్ నాన్న రోల్లో అలరించనున్నాడు.

Filed Under: Featuredనాన్నకు ప్రేమతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *