నాయక్ సాంగ్స్ విశేషాలు

Ram-Charan-Nayak

ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ “నేను షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సాంగ్స్ అన్నీ చూసేసాను. చరణ్ డాన్స్ ఇరగదీసేసాడు” అని అన్నాడు. “చిరంజీవి మాత్రమే ఏమిటి? మీరు కూడా సినిమా రిలీజ్ కు ముందే సాంగ్ ఎంజాయ్ చెయ్యండి” అని ఎవరో ఫుల్ సాంగ్ లీక్ చేసేసారు.

లీక్ అయిన సాంగ్, ట్రైలర్స్, మిడియా లో వచ్చిన న్యూస్ ను బట్టి .. ఏ సాంగ్ ఎవరితో అని అంచనా వేస్తే:

  1. ‘లైలా ఓ లైలా’ సాంగ్ ఫుల్ విడియో లీక్ అయిపోయింది. చరణ్ డాన్స్ కుమ్మేసాడు.
  2. ‘కత్తి లాంటి పిల్ల’ సాంగ్ .. కాజల్ తో ఈ ఒక్క సాంగే కావడం ఆశ్చర్యకరం.
  3. ‘ఒక చూపుకే పడిపోయా’ సాంగ్ అమలా పాల్ తో. ఈ పాట మధ్యలో వచ్చే కోరస్ చాలా బాగుంది.
  4. శుభలేఖ వ్రాసుకున్నా’ .. ఈ సాంగ్ కాజల్ తో అనుకున్నారు. కాని చివరి నిమషంలో అమలా పాల్ తో చేసినట్టుగా మీడియాలో న్యూస్ వచ్చింది. అమలా పాల్ కు రెండు సాంగ్స్ అన్నమాట.
  5. ‘ఎవ్వారమంటే ఏలూరే’ సాంగ్ .. ఛార్మి తో అని అందరికీ తెలిసిందే..
  6. నాయక్ టైటిల్ సాంగ్. ఈ సాంగ్ వివరాలు ఏమి బయటకు రాలేదు. స్టెప్స్ వుండవనుకుంట.(స్టెప్స్ వుంటే బిగ్ సరప్రైజ్)

Filed Under: Mega FamilyFeatured