‘నాయక్’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న బయ్యర్లు

Nayak-Vinayak

“రచ్చ ఎవరేజ్ గా వుంటేనే మెగా అభిమానులు ఆనంద పడిపోయారు. ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకుడు కావడం వలన రచ్చ కంటే కచ్చితంగా బెటర్ గా వుంటుందనే నమ్మకంతో” బయ్యర్లు మాత్రం సినిమా కలక్షన్స్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు, భారీ రేట్లు పెట్టి కొంటున్నారు.

సంక్రాంతి సీజన్ లో ఈ సినిమా రిలీజ్ కావడం పెద్ద ఎడ్వాంటేజ్. మాస్ సినిమా కావడం వలన భారీ ఓపినింగ్స్ గ్యారంటీ.

తన ప్రతి సినిమా సాంగ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వి.వి.వినాయక్, ఈ సినిమాకు అంతే శ్రద్ధతో చేసాడని వినికిడి. డైరక్టర్ కోపరేషన్ వుంటే రామ్ చరణ్ రెచ్చిపోతాడని అభిమానులు అనుకుంటున్నారు. సినిమా విడుదలకు ముందే లీక్ అయిన విడియో సాంగ్, సినిమాపై మరింత అంచనాలు పెంచింది.

వి.వి.వినాయక్ ఎక్సపెరమెంట్స్ చెయ్యడు. రొటీన్ ఎంటరటైన్ మెంట్ కు తన మాస్ పంచ్ జోడించి సినిమాను లాగించేస్తాడు. కథ కథనాలలో కొత్తదనం ఏమీ వుండదు. ఈ సినిమాకు వేరే భారీ సినిమాలు నుంచి మంచి పోటి వుండటం వలన ఏ రేంజ్ హిట్ అవుతాదో అంచనా వెయ్యడం కష్టం.

Filed Under: Mega FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *