నిజంగానే ఇంతిలా ఆలోచిస్తారా?

AA

కష్టపడి సంపాదించిన వంద రూపాయల్నీ, జీవితంలో విలువైన మూడు గంటల సమయాన్నీ కొన్ని లక్షల మంది ప్రేక్షకులు నాకోసం ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బునీ, వాళ్ల సమయాన్నీ వృథా చేశానన్న పేరు నాకు రాకూడదంటే కచ్చితంగా మంచి సినిమాలే చేయాలి. ఆ ఆలోచనే ఇన్నాళ్లూ నన్ను నడిపించింది. ఇకపైనా నడిపిస్తుంది.
అల్లు అర్జున్

తెలుగువాళ్ళకు సినిమాల పిచ్చి ఎక్కువ. సినిమాలకు ఆదరణ ఎక్కువ. ఆ పిచ్చికి ఆ ఆదరణకు కారణం మన హిరోలే. మన తెలుగుసినిమా కమర్షియల్ స్టామినాని పెంచిన హిరో చిరంజీవి అనటంలో ఎటువంటి సందేహం లేదు. పది ఇరవై రూపాయలు పెట్టి సినిమాకు వెళితే, మనం పెట్టిన విలువకు పదింతల వినోదం అందించే వాడు.(most of the times) అందుకే మెగాస్టార్ అయ్యాడు.

ఇప్పటి హిరోలు & దర్శకులు కొద్దిగా గుర్తింపు రాగానే “రెమ్యూనరేషన్ .. క్రేజ్‌ను ఎలా క్యాష్ చేసుకుందాం” అని ఆలోచిస్తున్నారు. ఇంటర్వ్యూలో సెల్ఫ్ డబ్బా కోసం కాకుండా, నిజంగానే అల్లు అర్జున్ సినిమా కోసం ప్రేక్షకులు వెచ్చిస్తున్న “డబ్బులు & టైం” గురించి అలా ఆలోచిస్తూ వుంటే, అభినందించ వలసిన విషయం. మెగాస్టార్ ను మించిన స్టార్‌గా ఎదుగుతాడు.

Filed Under: సరైనోడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *