నిజాన్ని అంగీకరించాలి .. అవమానంగా ఫీల్ అవ్వకూడదు ..

Pawan And Chiru

“చిరంజీవి” పేరు ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. చిరంజీవి తమ్ముడు “పవన్‌కల్యాణ్” పేరు కూడా చిరంజీవి పేరుకు కాస్తా అటూ ఇటూ ఆ స్థాయికే చేరుకుంది. ప్రస్తుతం “పవన్‌కల్యాణ్” పేరు ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. ఇది నిజం. ఇది అవమానంగా ఫీల్ అవ్వడం తప్పు. మెగా ఫంక్షనే కాదు, ఏ ఫంక్షన్ తీసుకున్నా “పవన్‌కల్యాణ్” పేరు చెపితే వచ్చే స్పందన ప్రస్తుతం ఇంకా ఎవరికీ లేదన్న మాట వాస్తవం. అల్లు అర్జున్‌ను ఇంప్రెస్ చెయ్యడానికి “కుమార్ 21 F” ఆడియో ఫంక్షన్‌లో, అల్లు అర్జున్ మేనేజర్స్ కొందరికి డబ్బులిచ్చో/ఆశ చూపో “AA” అని అరుస్తూ హడావుడి చేయించారని రూమర్స్ వున్నాయి. ( “కుమార్ 21 F” ఆడియో ఫంక్షన్‌లో వాళ్ళు గోల చూసి ఆనందించిన అల్లు అర్జున్, ఇప్పుడు హైపర్ ఫ్యాన్స్‌కు క్లాస్ పీకడం హైలట్)

చిరంజీవి అసహనానికి గురి అవుతున్న మాట వాస్తవం. చిరంజీవిని అవమానించాలనే వుద్దేశంతో చేస్తున్నారనేది అబద్ధం. పరిష్కారం చాలా సింపుల్: పవన్‌కల్యాణ్ గురించి చిన్న మాట చెప్పిస్తే సరిపోతుంది. సొంత ఫ్యామిలీనే కదా.. చెప్పడానికి ఇబ్బంది ఏమిటి?

హైపర్ ఫ్యాన్స్ హైపర్ చంపాలనుకొవడం మూర్ఖత్వం:
హైపర్ ఫ్యాన్స్ కేవలం పవన్‌కల్యాణ్‌కు మాత్రమే కాదు, అందరూ హిరోలకు వున్నారు. తమ హిరో పేరు అందరి నోటా వినాలనుకుంటారు. తాము అభిమానించే హిరోలను, తమ ఫ్యామిలీలో ఒకరిగా చూసుకుంటారు. కొందరయితే, ఫ్యామిలీ కంటే ఎక్కువగా అభిమాన హిరోను ప్రేమిస్తారు. వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. అభిమాన హిరో చెప్పినా వినరు. పరిష్కారం చాలా సింపుల్: వాళ్ళు కొరుకునేది చాలా చిన్నది. అభిమాన హిరో పేరు. అది కవర్ అయ్యేలా ఒక వాఖ్యం చెపితే చాలు. ఇంత చిన్న విషయం అవమానంగా ఫీల్ అవుతూ, అవమానించారనుకొవడం తప్పు.

పవన్‌కల్యాణ్‌ను పిలుస్తారు. పవన్‌కల్యాణ్ రాడు:
ఇంటి పెద్ద చిరంజీవి. చిరంజీవి పక్కన వుండగా “పవన్‌కల్యాణ్” అని అభిమానులు అరవడం పవన్‌కల్యాణ్‌కు ఇష్టం వుండదు, ఒకప్పుడు అందుకే వచ్చేవాడు కాదని ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు ఎందుకు రావడం లేదో పవన్‌కల్యాణ్ చెపితే కాని తెలియదు. మెగా హిరోలు ఎక్కువై పొయారు. ప్రతి ఫంక్షన్ మెగా భజన లెక్క అయిపోతుందని కొద్దిగా ఫీల్ అవుతున్నాడెమో.

Filed Under: Pawan Kalyan

commentscomments

  1. Ganesh says:

    Pawan kalyan ae oka 4,5 functions ki continue vaste aipotundhi kadaaa. fans yem anukuntunnaru ante pawan andaru divide chesaru anukuntunnaru. anduke arustunnaru. Pk side kuda chala mistake undhi.

  2. Hari says:

    thanks Ganesh. from your comment, added last paragraph.

  3. sai says:

    pawan kalyan is a most popular hero world

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *