నిర్ణయం

Screen Shot 2014-12-17 at 5.50.20 AM

ఇక్కడ వుద్దేశం పలానా నిర్ణయం తప్పు. పలానా నిర్ణయం ఒప్పు అని చెప్పడం కాదు.

దబాంగ్ సినిమాలో ఏముంది? అటువంటి సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. అది రిమేక్ చేస్తే ఎవడు చూస్తాడు? అసలు పవన్‌కల్యాణ్ ఆ సినిమాను ఎందుకు ఎంచుకున్నాడు?. తప్పుడు నిర్ణయం . అని చాలా మంది అన్నారు .. But రిజల్ట్: పవన్‌కల్యాణ్‌కు పూర్వ వైభవంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశాన్ని అధికారంలోకి తెచ్చింది.

నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో రాబోతున్న చిత్రం ‘ముకుంద’ . డిసెంబర్ 24న విడుదల కానున్న ఈ చిత్రం లో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

మెగాఫ్యామిలీ నుంచి వస్తున్న అందమైన పొడుగైన హిరో. భారీ అంచనాలు వున్నాయి. మొదటిసినిమా కావడంతో హిరోలో బిడియంతో పాటు బెరుకు కూడా కనిపిస్తుంది. ఆడియో సూపర్ హిట్.

ఈ సినిమాకు వున్న ఒకే ఒక్క ప్రొబల్మం హైప్. జిరో హైప్.

ఇదే హిరో పూరి జగన్నాధ్‌తోనో వి.వి.వినాయక్‌తోనో తన మొదటిసినిమా చేసి వుంటే, ఎంత హైప్ వుండేది?

జిరో హైప్ప్‌కు కారణం శ్రీకాంత్ అడ్డాల. ఇంతకు ముందు సినిమా “”సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” కు మంచి హైప్ వుంది. కారణాలు

  1. మల్టీ స్టారర్ మూవీ
  2. మహేష్‌బాబు “దూకుడు” “బిజినెస్ మేన్” తర్వాత “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” రావడం
  3. సంక్రాంతి సీజన్
  4. దిల్ రాజు నిర్మాత

సినిమాకు మంచి టాక్ రావడానికి మంచి రైట్ పబ్లిసిటీ ఎంత అవసరమో, సినిమాకు భారీ కలక్షన్స్ రావడానికి సినిమాపై హైప్ వుండటం చాలా అవసరం.

“డైరక్టర్ మంచోడు .. మంచి సినిమాలు తీస్తాడు” అనే పేరు వుంది కాబట్టి “ముకుంద” కచ్చితంగా మంచి సినిమా అవుతుంది. తన కొడుకు ఒక మంచి సినిమా ద్వారా పరిచయం కావాలని నాగేంద్రబాబు తీసుకున్న నిర్ణయం భారీ కమర్షియల్ విజయంగా కూడా మారుతుందా? 50 కోట్లు షేర్ సాధించి సన్సేషనల్ హిట్ అవుతుందా? తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.

Filed Under: Mega FamilyFeatured