నెం 1 డైరక్టర్

RM-TS

టాలీవుడ్ నెం 1 డైరక్టర్ ఎవరు?

మనకి ఇప్పుడు చాలా మంది కమర్షియల్ డైరక్టర్స్ వున్నారు. వాళ్ళల్లో నెం 1 డైరక్టర్ ఎవరు అంటే ఏకగ్రీవంగా ఒప్పుకొవడం కష్టం. కాని మగధీర తర్వాత ఏకగ్రీవంగా రాజమౌళి నెం 1 డైరక్టర్ అని అందరూ ఒప్పేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన మర్యాద రామన్న & ఈగ సినిమాలు ఆ స్థానాన్ని నిలబెట్టాయి.

అతడు సినిమా ద్వారా టాప్ డైరక్టర్స్ లిస్టులో చేరిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ తర్వాత జల్సా లాంటి కమర్షియల్ హిట్ & ఖలేజ లాంటి మంచి కాన్సప్ట్ సినిమాలు తీసినా అతనిని స్థానాన్ని పెంచలేకపొయాయి. అనవసరమైన ఖర్చుతో పాటు ఎక్కువ రోజులు సినిమా షూట్ చేస్తాడనే అపవాదు ఆయనపై వుంది.

జులాయి & అత్తారింటికి దారేది సినిమాలతో తనపై వున్న డిలే అపవాదు చేరేపేసుకొవడమే కాదు, ఒక బ్లాక్‌బస్టర్ & ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చి, టాలీవుడ్ నెం 1 డైరక్టర్ స్థానానికి పొటీ పడే స్థాయి ఎదిగాడు.

ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరక్టర్ టాలీవుడ్ నెం 1 డైరక్టర్ అనుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ నెం 1 డైరక్టర్ అని చెప్పవచ్చు.ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే రాజమౌళి తగ్గడం వలన కాకుండా, త్రివిక్రమ్ ఎదగడం ద్వారానే ఈ స్థానాని సంపాదించాడు. ఈ స్థానాన్ని నిలబెట్టుకొవాలంటే బాహుబలి సినిమాను మించిన సినిమాను త్రివిక్రమ్ తీయవలసి వుంది.

వి.వి.వినాయక్, శ్రీనువైట్ల, హరీష్ శంకర్ & మిగతా కమర్షియల్ డైరక్టర్స్ మూస పద్దతి పక్కన పెట్టి, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా వైవిధ్యంతో కూడిన సినిమాలు ట్రై చెయ్యాలి.

‘1’ ద్వారా మహేష్‌బాబు ఇచ్చిన అవకాశాన్ని సుకుమార్ ఎంతవరకు ఉపయోగించుకొని రాజమౌళి & త్రివిక్రమ్ లకు పోటీ ఇస్తాడో లేదో చూడాలి. కాకపొతే అతడు సినిమా మాదిరి ఓవర్ బడ్జెట్ అనే టాక్ ఫిలింనగర్‌లో వినిపిస్తుంది.

Filed Under: Extended FamilyFeaturedJust4Fun