నేడు రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన

banner-img1

మంచి నాయకుడు వస్తే ప్రజలు సపోర్ట్ చెయ్యడానికి రెడీగా వున్నారు. అధికారం కోసం వచ్చే నాయకులే తప్ప, నిస్వార్దంగా ప్రజలకు మేలు చేద్దాం అనే నాయకులు లేరు. అధికారం కోసం చేసే రాజకీయల్లో అడ్దమైన దారులు ఎతుక్కోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చెయ్యడమే కాదు, ఒక ముక్కకు దిక్కు లేకుండా చేసేసారు.

దిక్కులేని రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించాలి. అధికారం పక్షం ఏమి చేసినా తప్పే అంటోంది ప్రతి పక్షం. ప్రతి పక్షాన్ని చీపురపుల్ల లెక్క తీసిపారేస్తుంది అధికారం పక్షం. మన ఇగో సాటిస్‌ఫై అవ్వాలని తప్ప, అందరూ బాగుండాలి అని పనిచేసే నాయకులు కరువయ్యారు.

శుభ్రంగా సినిమాలు చేస్తూ తను సుఖంగా వుంటూ, అభిమానులను ఆనంద పరచక, ఈ దిక్కుమాలిన రాజకీయ దురద అంటించుకున్నాడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. ఆ దురదలో భాగంగా జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన 9.30 గంటలకు ఉండవల్లి చేరుకుంటారు. పెనుమాక, ఎర్రబాలెం మీదుగా రైతులను పలకరించుకుంటూ వెళ్లి బేతపూడిలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక్కడే మీడియాతోనూ మాట్లాడతారు.

చిరంజీవి ప్రజల్లో వుంటూ రాజకీయంగా విజయం సాధించాలని కోరుకుంటున్నారు కాని, అది జరగడం లేదు. పవన్‌కల్యాణ్ నుంచి సినిమాలు కోరుకుంటున్న సమయంలో ఇలా రాజకీయల్లో తిరగవలసి రావడం మెగా అభిమానులు ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్దం కావడం లేదు.

Filed Under: Pawan KalyanFeaturedTelugu