నేడే కంచె ఆడియో విడుదల

Kirsh

కంచె సినిమా పూర్తిగా డైరక్టర్ సినిమా. నిజమైన హిరో క్రిష్. ఈ సినిమాలో అవకాశం వరుణ్‌తేజ్‌ను వెతుక్కుంటూ రావడం నిజంగా వరుణ్‌తేజ్ అదృష్టం. క్రిష్ ఇంత పెద్ద ఎక్సపెరమెంట్ చెయ్యడం నిజంగా పెద్ద సాహసం. నిజాయితీగా తీసుంటే తెలుగుప్రేక్షక దేవుళ్ళు బ్రహ్మరధం పడతారు.కొత్తదనం వుంటే, తెలుగుమిడియా బాగా సపోర్ట్ చేస్తాది కూడా. కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్సింగ్‌లో తేడా జరిగితే మాత్రం ఎవరూ కాపాడలేరు.

వినాయకచవితి సందర్భంగా రామ్ చరణ్ తేజ్ ముఖ్యఅతిథిగా నేడే కంచె ఆడియో విడుదల కానుంది. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది. చిత్రం లోని అన్ని పాటలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించారు.

Filed Under: కంచె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *