పండగ చేస్కో

pandaga chesuko

‘బలుపు’ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పండగ చేస్కో’. అల్లు అర్జున్ చేయవలసిన సినిమా. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అవకాశం రావడంతో ఈ సినిమాను వదులుకున్నాడని ఫిలింనగర్ టాక్. ఎస్.ఎస్.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సాంగ్స్ రికార్డింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి ‘పండగ చేస్కో’ను నిర్మిస్తున్నారు.

గత వారం రోజుల నుండి ఈ సినిమా చిత్రీకరణ పోర్చుగల్‌లో జరుగుతుంది. రామ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ లపై సాంగ్ షూట్ చేస్తున్నారు. మార్చి 23 వరకు జరిగే ఈ షెడ్యూల్లో హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను, పాటలను తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం.

వేసవి బరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

Filed Under: Extended FamilyTelugu