పచ్చి అబద్ధాలు ఆడుతున్న జయసుధ

jayasudha

జయసుధ సీనులోకి రావడానికి కారణం మా ఆధ్యక్ష పదవికి “మంచు విష్ణు” ను ఏకగ్రీవంగా ఎన్నుకొవడానికి నాగేంద్రబాబు అంగీకరించక పొవడం. ఆ కోపంతో నాగేంద్రబాబు సపోర్ట్ చేసిన రాజేంద్రప్రసాద్‌కు పొటీగా జయసుధను దించారు.

నన్ను పోటీ చేయమని అడిగారు కాబట్టి మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని ఒక పక్క చెపుతూ “నేను డమ్మీ అభ్యర్థిని కాదు” అని జయసుధ అంటోంది. – అబద్ధం

ఒకరిపై ఒకరు బురద జల్లుకోవాల్సిన అవసరం లేదంటుంది. అసలు మొదలు పెట్టిందే మురళీ మోహన్ కదా!

నిజాలు మాట్లాడితే చాలా మంది బాధపడతారని అంటుంది. అటువంటప్పుడు మీడియా ముందుకు రావడం దేనికి?

పచ్చి అబద్ధాలు ఆడుతున్న జయసుధ అని అనుకుంటున్నారు. మురళీమోహన్‌తో ఈమె కూడా తన పరువు తనే తీసుకుంటుంది.

జయసుధ or రాజేంద్రప్రసాద్ .. ఎవరైనా అందరినీ కలుపుకొని పని చేసే వాళ్ళు అధ్యక్షులు అయితే, “మేము సైతం” లాంటి మంచి ప్రొగ్రామ్స్ చూసే భాగ్యం ప్రేక్షకులకు కలుగుతాది.

రాజేంద్రప్రసాద్ రాకముందే జయసుధను ఎనౌన్స్ చేసివుంటే, ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేదెమో. మురళీమోహన్ చేసిన చెత్త రాజకీయల వలన, ఇలా ఒకరి మీది ఒకళ్ళు మాటలు జారుకుంటూ సినిమా పరిశ్రమ పరువు తీసుకుంటున్నారు.

ఎన్నికలు అయిపొయిన తర్వాత, మళ్ళీ ఒకళ్ళది ఒకళ్ళు నాక్కుంటూ ప్రేక్షకులకు వెర్రిపప్పలను చేస్తారు. గౌరవంగా వుంటూ గౌరవం పుచ్చుకొవాల్సిన సీనియర్ నటులు ఇలా ప్రవర్తించి గౌరవాన్ని కొల్పొవడం బాదాకరం.

Filed Under: Extended FamilyTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *