పవన్‌కల్యాణ్‌ను సినిమాలు చేసుకోనివ్వండి

Pawan-Kalyan-telugu-actor

గబ్బర్‌సింగ్ & అత్తారింటికి దారేది సినిమాల సంచలన విజయాల తర్వాత, టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ నామజపం మరింత ఎక్కువైంది. ఇంతటి క్రేజ్ ఉన్న హీరో, సమాజం పట్ల అంకితభావం కలిగిన వ్యక్తి అయిన పవన్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని ఎప్పుటినుంచో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు సంచలన డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ మరింత ఆజ్యం పోసి వాటిని హీటెక్కించారు. ప్రస్తుతం దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర రాజకీయాలను తిరగరాసే నాయకుడు కావాలని కోరుకుంటున్న తరుణంలో పవన్ కొత్త పార్టీ పెట్టాలని కొందరు అన్నారు.

పవన్ పార్టీ విషయంలో ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో తాజాగా మరో ప్రచారం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపడితే ఎలా ఉంటుంది? అనే అంశంపై అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. అవినీతిరహిత పాలన, నీతివంతమైన రాజకీయాలే లక్ష్యంగా మాజీ ఐఏఎస్ అధికారి కేజ్రీవాల్ నెలకొల్పిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ ఢిల్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పవన్ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’లో చేరి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ పార్టీ విస్తరించాల్సిన అవసరం ఉందని, పవన్ కల్యాణ్ దానికి నేతృత్వం వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయాలో చిరంజీవికి ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా, మెగా అభిమానులు మాత్రం పవన్‌కల్యాణ్‌ను సినిమాలు చేసుకోనివ్వండి అంటున్నారు.

Filed Under: Pawan KalyanFeatured