పవన్‌కల్యాణ్‌పై ఒత్తిడి

Pawan Kalyan

పవన్‌కల్యాణ్ వీక్‌నెస్ “గౌరవం”. తనకు “గౌరవం” ఇస్తే చాలు అనుకుంటాడు. తెలుగుదేశం పార్టీ బాగా క్యాచ్ చేసారు. చంద్రబాబే స్వయానా పవన్‌కల్యాణ్ ఇంటికి వెళ్ళి ప్రచారం చెయ్యమని అడిగాడు. మోదీ ఒక పక్క చంద్రబాబును కూర్చో పెట్టుకొని, మరోపక్క పవన్‌కల్యాణ్‌ను కూర్చో పెట్టుకున్నాడు. పవన్‌కల్యాణ్ రెచ్చిపోయి బి.జె.పి & తెలుగుదేశం పార్టీలకు ప్రచారం చేసాడు. తెలుగుదేశం మీడియా ఫుల్ హైప్ చేసింది. పార్టీ విజయం కోసం అవి తప్పవు కాబట్టి, ఓకే.

చంద్రబాబు పాలన బాగుంది. రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఏమి చెయ్యాలో అది చేస్తున్నాడు. అధికార ప్రభుత్వంపై వుండే వ్యతిరేకతను ఎవరూ ఆపలేరు.

ఇప్పుడున్న ప్రొబల్మం కొత్త రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సపోర్ట్. చేసిన ప్రొమిసెస్ ఏమీ కూడా నిలబెట్టుకొవడం లేదు.

బి.జె.పి పై తిరుగుబాటు జెండా ఎగుర వెయ్యాలని పవన్‌కల్యాణ్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ట్వీట్స్‌లో తన వాయిస్ రైజ్ చేసాడు కాని, అది సరిపొదని & సమస్యలపై ప్రత్యక్షంగా ప్రశ్నించవలసిన సమయం ఆసన్నమైందని అంటున్నారు.

Filed Under: Pawan Kalyan