పవన్‌కల్యాణ్ కాల్ కోసం కలలు

Venkatadri_Express_Movie

సందీప్ కిషన్, రాకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ బాక్స్ ఆఫీసు వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై కిరణ్ నిర్మించిన ఈ సినిమాకి చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేయగా రమణ గోగుల మ్యూజిక్ అందించాడు. డైరెక్టర్ మేర్లపాక గాంధీ.

ఈ సినిమా విషయంలో పలువురు ఇండస్ట్రీ పెద్దల నుండి ప్రశంశలు అందుకున్నారు.

అలాగే సందీప్ కిషన్ కి ఓ షాకింగ్ కాల్ వచ్చింది. అది చేసింది మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆ తర్వాత సందీప్ కిషన్ అల్లు అర్జున్ ఎం చెప్పాడా అనేది ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ‘ అల్లు అర్జున్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ నచ్చిందని చెప్పారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూసి అంతలా నవ్వుకున్నానని చెప్పారు. నేను ఆర్య సినిమా చూసి ఆయన్ని స్పూర్తిగా తీసుకొని హీరోనయ్యాను. అలాంటిది ఇప్పుడు ఆయనే ఇలా మెచ్చుకోవడం, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ గురించి మంచిగా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. థాంక్స్ అన్న’ అని ట్వీట్ చేసాడు.

అంతే కాదు, పవన్‌కల్యాణ్ నుంచి కూడా కాల్ వస్తుందని ఎవరో ట్వీట్ చేస్తే, దానికి రిప్లైగా పవన్‌కల్యాణ్ కూడా కాల్ చేసే రోజు వస్తుందనుకుంటున్నాను అని అంటున్నాడు పవన్‌కల్యాణ్ వీరాభిమాని సందీప్ కిషన్. నితిన్‌ను ఎంకరేజ్ చేసినట్టు సందీప్ కిషన్ ను ఎంకరేజ్ చెయ్యడానికి ఒక ఆడియో ఫంక్షన్‌కు వస్తే సరి.

Filed Under: Extended FamilyFeatured