పవన్‌కల్యాణ్ ట్వీటర్లో పొరాటం

PK

రాజకీయ నాయకులు పార్టీ ప్రయోజనాల కోసం, అధికారంతో ఆఫీషియల్‌గా దోచుకొవడానికే పని చేస్తారన్నది నిజం. ఎన్నికల్లో వాగ్దానాలు కూడా ఆ సమయంలో ప్రజలను మభ్య పెట్టడానికే అన్నది కూడా నిజం. ఆ రోజు కాంగ్రెస్‌పై వున్న వ్యతిరేకతను ఓట్లుగా మరలచుకొవడానికి బి.జి.పి ఎన్నో అసాధ్యమైన వాగ్దానాలు చేసింది. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నో వాగ్దానాలు చేసింది.

ప్రతిపక్ష రాజకీయ నాయకులు, అధికార పక్షంపై వ్యతిరేకత క్రియేట్ చెయ్యడానికి వాగ్దానాలపై వ్యాఖ్యలు చేస్తూ వుంటారు. ప్రజలకు కూడా తెలుసు.

ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఉద్యమిస్తారనే భ్రమలో పవన్‌కల్యాణ్ వున్నాడు. పవన్‌కల్యాణ్ రోడ్డు మీదకు వస్తే, పవన్‌కల్యాణ్‌ను చూడటానికి వస్తారు కాని, ప్రత్యేక హోదా వలన కలిగే లాభాలు ఎవరికి తెలుసు? ..

అధికార తెలుగుదేశం నాయకులు కాసేపు ఎంతో లాభం అంటారు. కాసేపు అవసరం లేదంటారు. కాసేపు అది అంటారు. కాసేపు ఇది అంటారు. అంతా రాజకీయమే.

ఈ రాజకీయ బురదలో ఇమడలేక అన్నయ్య సినిమాలపై ఆసక్తి చూపుతుంటే, తమ్ముడు సినిమాలు వదిలేసి ఈ బురదలోకి రావడానికి ఆసక్తి చూపడం ఏమిటోనని మెగా అభిమానులకు అర్దం కావడం లేదు.

రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌తో పాటు తెలుగుదేశం/బి.జె.పి కూడా భాగమే అన్న సత్యాన్ని విస్మరించడం ఆశ్చర్యకరం. అడ్డగోలుగా మినహా రాష్ట్ర విభజన అసాధ్యం. తెలుగు ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ మాటకు కట్టుబడి ఆవిధంగా చేసింది. రాష్త్ర విభజనకు ఒప్పుకొని, ఇచ్చే సమయంలో మాట మార్చిన సీమాంధ్ర నాయకులకు కాంగ్రెస్‌ను విమర్శించే ఎటువంటి హక్కులు లేవు. అప్పుడు చేసిన పొరాటం కూడా న్యాయంగా విభజించండి అని కాదు, కలిసుందాం అనే దిక్కుమాలిన పొరాటం.

Filed Under: Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *