పవన్‌కల్యాణ్‌తో వరుణ్‌తేజ్

pawan-and-Varuntej

పవన్‌కల్యాణ్‌కు బ్యాడ్ ఇమేజ్ గుడ్ ఇమేజ్ .. రెండూ వున్నాయి. సినిమాల పరంగా హైలో వుంటూ రాజకీయంగా తను ఓపెన్‌గా సపోర్ట్ చేసిన చంద్రబాబు & మోదిలు రాజ్యాలని ఏలుతుండటంతో .. ఫార్మ్ లో వున్నాడు కాబట్టి గుడ్ ఇమేజ్ డామినేట్ చేస్తుంది. ఎంత గుడ్ ఇమేజ్ అంటే “ఒకప్పుడు పరిటాల రవి చేతిలో గుండు కొట్టించుకున్నాడని పుకార్లు సృష్టించి ప్రచారం చేసి బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేసిన వాళ్ళ చేతే, ఇప్పుడు జై జై లు కొట్టించుకుంటున్నాడు”.

ఒక పక్క తెలుగుదేశం పార్టీకి చెందిన మిడియా సపోర్ట్ .. మరో పక్క వైయస్సార్ మిడియా ఎటాకింగ్ .. “జనసేన” ఎలా నడుపుతాడో చూడాలి.

మొన్న అత్యద్భుతంగా జరిగిన “మేము సైతం” ప్రొగ్రాంలో లోటు అనిపించింది ఎమైనా వుందంటే, పవన్‌కల్యాణ్ రాకపొవడమే.

గుడ్ ఇమేజ్ .. బ్యాడ్ ఇమేజ్ .. ఇలా ఏమీ కేర్ చెయ్యకపొవడం పవన్‌కల్యాణ్ ప్రత్యేకత. అందుకే పవన్‌కల్యాణ్ ఎదైనా చెపితే మనస్పూర్తిగా చెపుతాడు. నిజాయితీగా నిజాలే చెపుతాడనే ఇమేజ్ వుంది.

1) నితిన్ చిన్నదాన నీకోసం ఆడియో ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్ వస్తాడని 2) ముకుంద ఆడియో ఫంక్షన్‌కు వస్తాడని 3) మేముసైతం లో కనిపిస్తాడని పవన్ అభిమానులు ఎంతో ఎదురుచూసారు. వారి ఆశ నిరాశగానే మిగిలింది.

ఇప్పుడు, పవన్‌కల్యాణ్ కోసం ప్రత్యేకంగా “ముకుంద” సినిమా చూపిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రచారం నిజం అయితే, సినిమా చూసాక పవన్‌కల్యాణ్ తో జస్ట్ రెండు మాటలతో సరిపెట్టకుండా .. పవన్‌కల్యాణ్‌తో వరుణ్‌తేజ్‌ను కూర్చో పెట్టి, నాగబాబు ఫుల్ లెంగ్త్ ఇంటవర్వ్యూ చేస్తే బాగుంటుందని మెగా అభిమానుల ఆశ.

Filed Under: Pawan Kalyan