పవన్‌కల్యాణ్ లక్ష్యం సి.యం కాదు

R-Narayana-Murthy-Pawan-Kalyan

దాసరి నారాయణ రావు మాటలు మీడియా కూడా సిరియస్‌గా తీసుకొవడం మానేసింది. అభిమానులు అసలు పట్టించుకోరు. కాకపొతే ఒకప్పుడు నెం1 నుంచి నెం 10 వరకు చిరంజీవి అని ఆకాశానికి ఎత్తేసి మాట్లాడిన దాసరి, చిరంజీవిని ఇగ్నోర్ చెయ్యడం ఏ మెగా అభిమానికైనా చిన్న బాద. ఆయన్ని మెగా ఫంక్షన్స్ కు ఎందుకు పిలుస్తారో, పవన్‌కల్యాణ్ సినిమా ఎందుకు చేస్తున్నాడో జవాబులు లేని ప్రశ్నలే.

“అలా మాట్లాడితే కాని ఎవరూ పట్టించుకోరు అనుకునే ఆయన మూర్ఖత్వాన్ని”, “ఆయనేదో పెద్దోడుగా ఫీల్ అవుతాడు”, “ఆ ఫీల్‌ను డిస్ట్రబ్ చెయ్యడం ఇష్టం లేక” ఎవరూ, “అది తప్పని” “తన పెద్దరికాన్ని తనే దిగజార్చుకుంటున్నాడని” ఎవరూ చెప్పే ధైర్యం చెయ్యరేమో.

మొన్న దాసరి ప్రసంగంతో అప్‌సెట్ అయిన మెగా అభిమానులకు ఆర్.నారాయమూర్తి స్పీచ్ ఎంతో రిలీఫ్ ఇచ్చినా, ఆయన ప్రసంగాన్ని పవన్‌కల్యాణ్ ఎక్కడ సిరియస్‌గా తీసుకుంటాడోనని భయం పట్టుకొవడం ఖాయం.

మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచింది అంటే ఆ పార్టీ చేసే రాజకీయం, పొరాడే తత్వం, మీడియా సపోర్ట్ .. ఇలా చాలా అంశాలు వున్నాయి. అలానే మోడి గెలవడానికి కారణాలు చాలా వున్నాయి. పవన్‌కల్యాణ్ కూడా ఒక కారణం అంటే తప్పు లేదు కాని, కేవలం పవన్‌కల్యాణ్ ప్రచారం వలనే చంద్రబాబు సిం.యం అయ్యాడు, మోడి పి.యం అయ్యాడనే పొగడ్తలు పవన్‌కల్యాణ్‌ను ములగచెట్టు ఎక్కించడం తప్ప వేరేదేదైనా వుందా?

అసలు పవన్‌కల్యాణ్ లక్ష్యమే సి.యం కానప్పుడు, పవన్‌కల్యాణ్ సి.యం అవ్వాలని కొరుకొవడంలో ఏమైనా అర్దం వుందా?

మీడియా సపొర్ట్ లేకుండా రాజకీయాలు చేస్తే ఏమవ్వుతుందో చిరంజీవి వైఫల్యమే ప్రత్యక్ష సాక్ష్యం. సినిమాల్లో సక్సస్‌ఫుల్ హిరో అవ్వడం వలన ఒక వర్గం ప్రేక్షకుల్లో ఏర్పడిన పోటి ద్వేషంగా మారి విలయ తాండవం చేస్తున్నప్పుడు, ఆ వర్గానికి తోడు, చిరంజీవి రాజకీయాల్లో తమకు ఎక్కడ పవర్ దక్కనీయకుండా చేస్తాడనే భయంతో మరో వర్గం ప్రజలను మొత్తం బ్రెయిన్ వాష్ చేసేసి చిరంజీవిపై సానుభూతితో కూడిన ద్వేషం పెంచేసారు. వారి ద్వేషం ఇంకా కొనసాగుతూనే వుంది.

“పవన్‌కల్యాణ్ చిరంజీవి మాదిరే కాకపొయినా రాజకీయాల్లో వైఫల్యం చెందడం ఖాయం, సినిమాల్లోనే కంటీన్యూ అవుతూ చిన్నా చితక సేవా కార్యక్రమాలు చేసుకొవాలని” మెగా అభిమానులు కోరుకుంటుంటే ఇటువంటి ప్రసంగాలతో రెచ్చగొట్టడం ఎంతవరకు భావ్యం?

?t=1h2m10s

Filed Under: Pawan KalyanFeaturedTeluguరేయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *