పవన్ కళ్యాణ్ ‘పంజా’ – మై టాక్

panja

సినిమా ఎలా వుంది?
అభిమానులు ఎగిరి గంతులేసే సినిమా కాదు.కానీ ఒక డిఫరెంట్ సినిమా, ఇలా ఎందుకు చేయకూడదు అని ఆలోచనలు రేకెత్తించే సినిమా. మాస్, క్లాస్ అని తేడా లేకుండా, అందరికి ఒకే రేంజ్ లో నచ్చే సినిమా. ఆ రేంజ్ ఏమిటనేది ఇప్పుడే చెప్పడం కష్టం.

చూడవచ్చా?
ఒక స్లో యాక్షన్ మూవీ చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడవచ్చు. డిఫరెంట్ ప్రయత్నం అని కచ్చితంగా చెప్పవచ్చు.

దర్శకుడి ప్రత్యేకత ఏమిటి?
పవన్ కళ్యాణ్ గురుంచి ఏమి తెలియక పోవడం, పవన్ కళ్యాణ్ తో సినిమా అనుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నీ చూసి పవన్ కళ్యాణ్ ఎలా చేసాడో తెలుసుకోవడం. డిఫరెంట్ సినిమా తియ్యాలన్న ఉత్సాహం తప్ప, ప్రేక్షకులకు ఏమి కావాలో తెలియని దర్శకుడే. ఆ పిల్లతనం/అమాయకత్వం ప్రతి సీను లోనూ కనిపించింది.

పవన్ కళ్యాణ్ ఎలా చేసాడు?
గెడ్డంతో బాగున్నాడు కాని, కాన్ఫిడెంట్ గా లేడు & డల్ గా అనిపించాడు.

లోపాలు ఏమిటి?
సినిమాలో ఏ ఒక్క పాత్ర కూడా ఎందుకలా ప్రవర్తిస్తుంది & ఎవరి పాత్ర ఎవరికీ కీలకం అనే దానిపై స్పష్టత లేదు, మనం ఊహించుకోవలసిందే. టైటిల్ సాంగ్ కోసం ఎదురుచూపులు నిరాశే. చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది కాని, కథ, పాత్రలు, కథనం అసలు బాగోలేదు.

కథలో కసి, కథనంలో వుండవలసిన ఉత్కంట లేవు. దీనికి తోడు పాత్రల స్వభావం ప్రేక్షకుల ఉహాకే వదిలేసారు.

కొత్తదనం ఏమిటి?
మొక్కలపై హిరోయిన్ ప్రేమ & పోరాటం. ఆలోచింప చేసే కొత్త పాయింట్.

హైలట్స్ ఏమిటి?
పల్లెటూర్ లో వచ్చే సీన్స్ అన్నీ బాగున్నాయి. బ్రహానందం సాంగ్ చాలా బాగుంది. ఇవే సినిమాకు ఆయువు పట్టు.

My Final Point:
పూర్తిగా సాటిసఫై అవ్వలేదు, అలా అని డిస్సపాయింట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గురించి ఏమి తెలియని వాళ్ళతో చేయడం కంటే , కథ-స్క్రీన్ ప్లే -దర్శకత్వం పవన్ కళ్యాణ్ చేయడం 200% బెటర్.

Filed Under: Pawan KalyanHari Reviews