పవన్ కళ్యాణ్ “సర్దార్”కు రెడీ

image

పవన్ కళ్యాణ్ కు తన పరిధులు తనకు బాగా తెలుసు.

  1. జానీ సినిమా
  2. కామన్ మేన్ ప్రొటక్షన్ ఫోర్స్
  3. ప్రజారాజ్యం

ఈ ఫెయిలుర్స్ తో చాలా వరకు తెలుసుకున్నాడు.

ఏమి తెలుసుకున్నాడు?

  1. ప్రేక్షకులు చూపించే ఆదరణకు మించిన పదవులు ఏమి వుండవు.
  2. ప్రత్యర్డులు రాజకీయాల్లో పండిపోయారు. డబ్బు, వర్గం, కులం, మతం .. ఇలా సాధ్యమైన వలలతో ప్రజలను లొంగదీసుకొని బానిసలుగా మార్చేసారు.
  3. రాజకీయాలు, ప్రజలను అసహనానికి గురిచేయకూడదు. అలా చేసినపుడు తన బాద్యతగా ఒక ట్విటు, ఒకరోజు పర్యటన(ఆహ్వానం వుంటేనే) & ఒక ప్రెస్ మీట్ చేస్తాడు.

పవన్ కళ్యాణ్ “సర్దార్”కు రెడీ అంటే?
తన బాద్యతగా రెస్పాండ్ అయ్యాడు. ఇక చేయగల్గింది ఏమి లేదు. అభిమానులకు ఆనందపరచ డానికి & డబ్బు సంపాదనకు గబ్బర్ సింగ్-2 “సర్దార్” చెయ్యడానికి అన్నీ క్లియర్ అయినట్టే అని అనుకోవచ్చు.

రైతుల ఆవేదన & రాష్ట్రం స్పెషల్ స్టేటస్ ఎవరు పట్టించుకుంటారు?
ప్రజలను డబ్బు, వర్గం, కులం, మతం పేరుతో మభ్యపెట్టి గెలిచిన ప్రజా ప్రతినిధుల దయ మీద ఆదారపడి వుంది.

Filed Under: Pawan KalyanFeaturedTelugu