పవన్-చరణ్ దర్శకుడెవరు?

image

హీరోలు దర్శకుల రెమ్యునరేషన్ కు తట్టుకొని సినిమాలు తీయగల నిర్మాతలు లేరు మనకు. ప్రస్తుతం పెద్ద హీరోలను పెద్ద దర్శకులను కలిపి చేసే నిర్మాతలంతా ఎవరికో బినామిలే అని పబ్లిక్ టాక్.

బినామిలా గోల లేకుండా పవన్ కళ్యాణే నిర్మాతగా మారి, రామ్ చరణ్ తో సినిమా అని ఎనౌన్స్ చేసారు. ఆ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ అని జోరుగా ప్రచారం జరుగుతుంది.

హిరో రామ్ చరణ్ & దర్శకుడు త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కు కావాల్సిన వాళ్ళే కావడంతో రెమ్యునరేషన్ వుండదు. లాభ నష్టాలు పంచుకోవడమే.

ఈ న్యూస్ నిజమైతే ఎప్పటినుండో మెగాఅభిమానులు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్న కాంబినేషన్ నిజం చేసినందుకు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞ్జతలు తెలుపుకుంటున్నారు.

Filed Under: Mega FamilyFeaturedTelugu