పవన్ డబ్బింగ్ అయిపోయింది

Share the joy
  •  
  •  
  •  
  •  

Screen Shot 2016-03-16 at 7.16.41 PM

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఏప్రిల్ 8న సమ్మర్ సీజన్‌ కానుకగా భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. ‘పవర్’ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌. ఇంకా రెండు వారాలే వుంది. ఏ వర్క్ జరుగుతుందో అని ఫ్యాన్స్ ఆత్రుతగా వున్నారు. టీమ్ అన్ని కార్యక్రమాలనూ పకడ్బందీగా పూర్తి చేసే పనిలో పడిపోయింది. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేస్తూనే మరో పక్క మిగిలి ఉన్న రెండు పాటల షూటింగ్‌ను పూర్తి చేసేందుకు నిన్న రాత్రి టీమ్ స్విట్జర్లాండ్ బయలుదేరింది. ఇక పవన్ కూడా నేడు తన డబ్బింగ్ పార్ట్ మొత్తాన్నీ పూర్తి చేసి స్విట్జర్లాండ్ వెళ్ళిపోయారు. టీమ్ ఇప్పటికే స్విట్జర్లాండ్‌లో అన్ని సిద్ధం చేసుకోగా, పవన్ రేపట్నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ స్విట్జర్లాండ్ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *