పవన్ – పివిపి సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారు?

Venkatesh, Raju Sundaram, Meher Ramesh at Shadow Movie Working Stills

పవన్ కళ్యాణ్ – పివిపి కాంబినేషన్లో ఓ సినిమా రానుందని అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 సినిమా షూట్ కంప్లీట్ చేసాక ఈ కొత్త సినిమా 2014 మధ్యలో మొదలు కానుంది అని విషయం కూడా అందరికీ తెలిసిందే.

సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారోనని మెగా అభిమానుల్లో భయం పట్టుకుంది. ఎందుకంటే యస్.జె.సూర్య రికమెండేష్‌న్‌తో రాజు సుందరానికి పవన్‌కల్యాణ్ మాట ఇచ్చాడు. అసలు పివిపి నిర్మాతను పవన్‌కల్యాణ్ దగ్గరకు తీసుకొని వెళ్ళిందే మెహర్ రమేష్ కాబట్టి, మెహర్ రమేష్ అవ్వడానికి కూడా ఛాన్సస్ వున్నాయి.

ఒక సమయంలో పివిపి సినిమాని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తాడనే వార్తలు వినిపించాయి కానీ అవి అధికారికంగా ఎలాంటి కార్యరూపం దాల్చలేదు. బలుపు దర్శకుడు మలినేని గోపిచంద్ కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే బన్నీతో కమిట్ అయ్యాడు.

రాజు సుందరం, మెహర్ రమేష్ లతో పాటు గమ్యం వేదం దర్శకుడు ‘క్రిష్’ కు కూడా అవకాశం వుంది. క్రిష్ అయితే బెటర్. కమర్షియల్ హిట్ కాకపొయినా ఒక మంచి సినిమాలో చేసాడనే తృప్తి వుంటుంది.

Filed Under: Pawan KalyanFeatured