పవర్‌స్టార్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న డాలీ

pawan-kalyan-and-director-dolly

సంపత్‌నందితో గబ్బర్‌సింగ్-2 అన్నారు. పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. చివరికి కాన్సిల్ అయ్యింది. నిజానికి గబ్బర్‌సింగ్ లాంటి సినిమాలు బోల్డన్ని సినిమాలు వచ్చాయి. ఇంకా గబ్బర్‌సింగ్-2 చెయ్యడానికి ఏముంది? నెగెటివ్ షేడ్స్ వున్న మంచి పొలీస్ ఆఫీసర్ పాత్రల్లో ప్రేక్షకులు చూడటానికి ఏమి మిగిలివుంది?

పవర్ ఫేం బాబితో గబ్బర్‌సింగ్-2 అన్నారు కాని, అది కూడా కాన్సిల్ అయ్యి, “సర్దార్” అని కొత్త సబ్జక్ట్ చేస్తున్నారని వినికిడి. అది కూడా డౌటే అని టాక్ నడుస్తుంది.

నెక్స్ట్ చెయ్యబోయే సినిమాపైనే ఇంకా క్లారిటి లేదు. ఆ తర్వాత చెయ్యబోయే సినిమాపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. గోపాల గోపాల సినిమా ఆడియో వేడుకలో పవన్ గోపాల గోపాల చిత్రం దర్శకుడు డాలీ దర్శకత్వ పటిమపై ప్రశంసలు కురిపించడమే కాకుండా..ఆయనతో మళ్లీ మళ్లీ సినిమా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దానిని బేస్ చేసుకొని “పవర్‌స్టార్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న డాలీ” అని ఊహాగానాలు మొదలయ్యాయి.

Filed Under: Pawan KalyanTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *